Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : మరో శ్రీదేవి తెరంగేట్రంకు సిద్దం

By:  Tupaki Desk   |   29 May 2021 3:30 AM GMT
ఫొటోటాక్‌ : మరో శ్రీదేవి తెరంగేట్రంకు సిద్దం
X
అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని వదిలేసి వెళ్లినా కూడా ఆమె తన రూపంను జాన్వీ కపూర్‌ గా వదిలేసి వెళ్లి పోయిందని అభిమానులు అనుకుంటూ ఉంటారు. తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు గాను అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జాన్వీ కపూర్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అందంతో అభినయంతో తల్లి మాదిరిగా కనిపిస్తూ జూనియర్ శ్రీదేవి అంటూ అభిమానులతో పిలిపించుకుంటుంది జాన్వీ. త్వరలో మరో శ్రీదేవిగా ఖుషీ కపూర్‌ కూడా పిలిపించుకుంటుందని ఈ ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది.

గతంలో ఎత్తు పళ్లతో పాటు ఇతరత్ర కారణాల వల్ల ఖుషి కపూర్‌ పై ట్రోల్స్ వచ్చేవి. అక్క జాన్వీ మాదిరిగా అందంగా లేరు.. తల్లి శ్రీదేవి పోలికలు రాలేదు అంటూ విమర్శలు దక్కించుకుంది. అలాంటి ఖుషి కపూర్‌ ఇప్పుడు హీరోయిన్‌ కు ఏమాత్రం తగ్గినట్లుగా లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా వరుసగా ఫొటో షూట్‌ లతో ఖుషి సందడి చేస్తోంది.

ఈ ఫొటోలో ఖుషి చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్ లను మించి అందంగా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. తప్పకుండా ఖుషి కపూర్‌ సినిమాల్లోకి రావాల్సిందే.. ఆమె స్టార్‌ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.