Begin typing your search above and press return to search.

శ్రీదేవి సిన్న కూతురుకి స్పీడెక్కువ

By:  Tupaki Desk   |   28 Sep 2015 11:30 AM GMT
శ్రీదేవి సిన్న కూతురుకి స్పీడెక్కువ
X
అందాలతార శ్రీదేవి.. గతమంతగా కాకపోయినా ఇప్పటికీ తన మార్క్ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అతిలోకసుందరి ఇద్దరి కూతుళ్లు కూడా సినిమారంగంలో సత్తా చాటేందుకు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. ఇంకా అనుభవజ్ఞూరాలైన అమ్మ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కూతుళ్లతో ఎప్పుడు ఎంట్రీ ఇప్పించాలో, కెరీర్ ఎలా డిజైన్ చేయాలో శ్రీదేవికి మంచి విజనే ఉన్నట్లుంది. అందుకే ఎప్పుడడిగినా అబ్బెబ్బే అనే అంటుంది.

అదే సమయంలో కూతుళ్లని కత్తుల్లా తయారు చేసి పార్టీలకు, ఈవెంట్లకు మాత్రం తిప్పుతూనే ఉంటుంది. ముఖ్యంగా పెద్ద కూతురు జాన్వి కపూర్ అయితే.. హీరోయిన్లకు తీసిపోని రేంజ్ లో రెడీ అయిపోతుంటుంది. కాకపోతే ఎప్పుడూ అమ్మ పక్కనే కనిపిస్తుంటుంది. కానీ చిన్న కూతురు ఖుషీ అలాక్కాదు. అమ్మడు అమ్మ కంటే ఫాస్ట్. అందుకే.. తనకు తోచినట్లుగా, ఈ జనరేషన్ కు తగినట్లుగా న్యూస్ లో నానేందుకు ట్రై చేస్తుంది.

జాక్ అండ్ పాప్ ర్యాప్ మోడల్స్ ఎడ్ షీరన్ - జాక్ గ్లిన్ స్కీ అంటే ఈమెకు చాలా ఇష్టం. తన సోషల్ నెట్ వర్క్ లో వీళ్ల ఫోటోలు ట్వీట్ చేస్తుంటుంది. తాజాగా జాక్ కి గట్టి ముద్దిస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ కిస్సింగ్ ఫోటో సోషల్ నెట్ వర్క్ సైట్లలో విపరీతంగా పాపులర్ అయిపోయింది. శ్రీదేవి సిన్న కూతురుకి స్పీడెక్కువ అనుకుంటున్నారు నెటిజన్లు ఈ ఫోటో చూసి.