Begin typing your search above and press return to search.
దర్శకుడి డాటర్ ని పెళ్లి కూతురును చేసిన ఖుషీ
By: Tupaki Desk | 2 Jun 2023 10:31 PMప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె.. ప్రముఖ యూట్యూబర్ ఆలియా కశ్యప్ ప్రేమాయణం డేటింగ్ వ్యవహారం గురించి తెలిసిందే. మే 20న తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆలియా అధికారికంగా వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని అందమైన ఫోటోలతో ఈ శుభవార్తను అందించింది.
రెండున్నరేళ్లుగా ఈ జంట సహజీవనంలో ఉంది. ఎట్టకేలకు ఆలియాకి పెళ్లి ఘడియలు దగ్గరపడుతున్నాయి. త్వరలో విదేశీ ప్రియుడు షేన్ గ్రెగోయిర్ ని పెళ్లాడేయబోతోంది. పెళ్లి రోజు సమీపిస్తున్న తరుణంలో ఆలియా తన సన్నిహితులతో కలిసి 'పెళ్లికూతురు అలంకరణ' వేడుకను జరుపుకుంది.
ఆమె తన ప్రాణ స్నేహితురాలు శ్రీదేవి - బోనీ కపూర్ ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథి. ఖుషీ స్వయంగా తన స్నేహితురాలు ఆలియాను పెళ్లి కూతురుని చేసిన బృందాన్ని లీడ్ చేసిందట. ఈ ప్రత్యేక సందర్భం నుండి కొన్ని అద్భుత క్షణాలను కెమెరాలో బంధించి ఆ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
శుక్రవారం నాటి ఈ వేడుకలో ఆలియా స్నేహితురాలు ఖుషీ- మరో ఫ్రెండ్ ముస్కాన్ చనానా కనిపించారు. మొదట్లో ఆలియా తన భారీ వజ్రాల ఉంగరాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ ''బ్రైడెజిల్లా'' అంటూ ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కశ్యప్ తన ఇన్ స్టాగ్రామ్ కథనంలో సెల్ఫీని పంచుకుంది.
స్నేహితులు ఖుషీ కపూర్ - ముస్కాన్ చనానాతో ఆనందకరమైన క్షణాన్ని కెమెరాలో బంధించారు.ఈ ఫోటోలకు ఎమోజీలతో పాటుగా 'పెళ్లి పార్టీ' అని ఆలియా క్యాప్షన్ ఇచ్చింది. వేడుకలో ఆ ముగ్గురూ అందంగా నవ్వుతూ కనిపిస్తారు. ఈ వేడుకకు ఆలస్యంగా వచ్చిన స్నేహితులతో అస్పష్టమైన ఫోటోని కూడా ఆలియా షేర్ చేసింది.
అంతకుముందు ఆలియా తన సోషల్ మీడియా ఖాతాలో తన పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేసింది. ఆమె రెండు అందమైన చిత్రాలను షేర్ చేసింది. నా జీవితాంతం నీతో గడపడానికి నేను వేచి ఉండలేను.. నా ప్రేమ. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను అంటూ ప్రియుడి గురించి ఆలియా ఎమోషనల్ అయ్యింది.
యూట్యూబర్ ఆలియా కశ్యప్ తన ఆకర్షణీయమైన కంటెంట్ తో తొలిగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఆమె తన జీవితంలోని వివిధ అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినా కానీ అప్పుడప్పుడు తన వ్యక్తిగత అనుభవాలను వీడియోల రూపంలో ప్రదర్శించింది. వీటిలో షేన్ గ్రెగోయిర్ తో అనుబంధం గురించి బయటపడింది. ఆసక్తికరంగా ఈ జంట డేటింగ్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఇరువురూ ఒకటవ్వడం సినిమా కథనే తలపిస్తుంది.