Begin typing your search above and press return to search.

వయసు మరిచిన సూపర్ డాన్స్: వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   11 Feb 2018 11:52 AM GMT
వయసు మరిచిన సూపర్ డాన్స్: వైరల్ వీడియో
X
పార్టీల్లో మందు కొట్టడం - డాన్స్ చేయటం ఎక్కడైనా సర్వసాధారణంగా జరిగేదే. అందులో వింతేమి లేదు. ప్రతి వేడుకలో ఇదంతా చూస్తూనే ఉంటాం. అది సామాన్యులు చేస్తే ఎవరు పట్టించుకోరు కాని బాగా పేరున్న సినిమా తారలు అందులోనూ హీరొయిన్లు చేసినప్పుడు ఆ వీడియో బయటికి వచ్చినప్పుడు వైరల్ కాకుండా ఉంటుందా. ఇప్పుడూ అదే జరిగింది. చెన్నై సవేరా గ్రాండ్ లో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్న నిన్నటి తరం హీరొయిన్లు ఖుష్బూ సుందర్ - సుకన్య పాపులర్ సూపర్ హిట్ హింది సాంగ్ ‘పియా తు అబ్ తో ఆజా’ పాటకు మైమరచి డాన్స్ చేస్తూ అక్కడ జోష్ నింపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫాంలో ఉన్న హీరొయిన్లు చేస్తే ఏదోలే అనుకోవచ్చు కాని వయసొచ్చిన పిల్లలు ఉన్న మాజీ హీరొయిన్లు చేస్తే ఆ మజానే వేరు.

నిజానికి ఇది వ్యక్తిగత పార్టీ. ఆహ్వానించిన వారి వివరాలు కూడా దొరకలేదు. అక్కడ ఖుష్బూ, సుకన్య ఒక టేబుల్ దగ్గర బఫే తీసుకుంటూ పాట వచ్చినప్పుడు కాస్త పక్కకు వచ్చి డాన్స్ చేస్తూ తిరిగి తినడానికి వెళ్ళిపోవడం మాత్రమే అందులో ఉంది. నటుడు, దర్శకుడు మనోబాల కూడా పక్కనే ఉన్నాడు. వీడియో బయటికి రావడం ఆలస్యం ఇలా మందు కొట్టి డాన్స్ చేస్తున్నారు అంటూ వైరల్ చేయటంతో ఇది విపరీతంగా షేర్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉంటున్న ఖుష్బూ తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపుతున్నారు. ఈ నేపధ్యంలో ఖుష్బూ డాన్స్ వీడియో ని వైరల్ పేరిట తమ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఫాన్స్ రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు.

అజ్ఞాతవాసిలో పవన్ సవితి తల్లిగా నటించిన ఖుష్బూకు ఒకప్పుడు తమిళనాట భీభత్సమైన ఫాలోయింగ్ ఉండేది. ఎంతలా అంటే ఆమెకు ఏకంగా గుడి కట్టేంతగా. సుకన్య పెద్దరికం సినిమాతో తెలుగువాళ్ళకు బాగా సుపరిచితురాలు. మహేష్ బాబు శ్రీమంతుడులో తల్లి పాత్రలో కనిపించింది. ఈ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ కాబట్టి మనవాళ్ళకు కూడా సహజంగానే ఆసక్తి కలుగుతోంది.