Begin typing your search above and press return to search.

అలనాటి అందాల తార ట్విట్టర్ అకౌంట్ హాక్..

By:  Tupaki Desk   |   7 April 2020 3:40 PM GMT
అలనాటి అందాల తార ట్విట్టర్ అకౌంట్ హాక్..
X
సౌత్ ఇండియా అలనాటి నటి కుష్బూ సుందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నటి కుష్బూ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ అయిందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌‌ ఫాలోవర్స్‌తో పంచుకుంది. అంతేకాదు తన ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసినట్టు వెల్లడించింది. దీంతో అభిమానులు జాగ్రత్తగా ఉండాలంటూ కోరారు. ఈ విషయమై ఎవరైనా తనకు సహాయం చేయగలరా అని రిక్వెస్ట్ చేశారు. గత రెండు రోజుల్లో నేను నా పాస్‌వర్డ్‌ను మార్చుకోలేకపోయానంటూ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా కుష్బూ తన అకౌంట్ ఎలా హ్యాక్ అయిందో తెలియడం లేదంటూ వాపోవడం తో ఆమె అభిమానులలో కంగారు మొదలైంది. మరోవైపు పాస్‌వర్డ్ మరిచిపోవడం కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ రావడం కానీ జరిగి ఉంటుందని ఖుష్బూ పేర్కొన్నారు.

అయితే నిజంగానే తన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయిందనే విషయం మాత్రం తెలియడం లేదంది. ఈ విషయంలో ట్విట్టర్ కూడా తనకు హెల్ప్ చేయడం లేదంది. నా అకౌంట్ ఏమైనా సస్పెండ్ అయిందా అనే అనుమానం కలుగుతుంది. ఈ విషయమై ఎవరికైనా తెలిస్తే తనకు చెప్పండి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోరింది. కుష్బూ గతేడాది తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. ట్విట్టర్‌లో తనను ఎక్కువగా ట్రోల్ చేయడంతో మనస్తాపం చెందిన ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అనవసరపు టెన్షన్లను తప్పించుకోవడానికి తాను సోషల్ మీడియా నుంచి వైదొలగాలని అనుకొంటున్నాను అని అన్నారు. కానీ సన్నిహితుల సలహా మేరకు తన ట్విట్టర్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకొన్నారు. తమిళ తెరపై కుష్బూ మళ్లీ కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ తో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు.