Begin typing your search above and press return to search.

అన‌కొండ లుక్ లో పాప్ స్టార్ హ‌ల్ చ‌ల్

By:  Tupaki Desk   |   28 Nov 2020 12:46 PM IST
అన‌కొండ లుక్ లో పాప్ స్టార్ హ‌ల్ చ‌ల్
X
పాప్ స్టార్స్ క‌ర్ధాషియ‌న్ సిస్ట‌ర్స్ హంగామా గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం ఏదో ఒక వివాదాస్ప‌ద అంశంతో క‌ర్ధాషియ‌న్ సిస్ట‌ర్స్ బోలెడంత హ‌డావుడి చేస్తుంటారు. ఇంత‌కుముందు న్యూయార్క్ వేదిక‌గా జ‌రుగుతున్న మెట్ గాలా -2019 ఈవెంట్ లో ది గ్రేట్ కిమ్ క‌ర్ధాషియ‌న్ డిజైన‌ర్ లుక్ క‌ళ్లు చెద‌ర‌గొట్టింది.

అందాల ఆర‌బోత‌లో ఇప్పుడు కిమ్ క‌జిన్ కోలే సాసీ క‌ర్ధాషియ‌న్ ఏమాత్రం త‌క్కువ కాదు. కోలే క‌ర్ధాషియ‌న్ లేటెస్ట్ డిజైన‌ర్ వేర్ సంథింగ్ స్పెషల్ లుక్ తో ఆక‌ర్షించింది. ఇదో స్పెష‌ల్ స్నేక్ లుక్ స్టన్నింగ్ అంటూ యువ‌త‌రంలో ముచ్చ‌ట సాగుతోంది.

చూస్తుంటే కొండ చిలువ‌ను త‌ల‌పించే డిజైన‌ర్ డ్రెస్ లో కోలే సంథింగ్ స్పెష‌ల్ గా కనిపిస్తోంది. అమెజాన్ లో సంచ‌రించే అరుదైన‌ అన‌కొండ శ‌రీరాకృతితో ఈ డిజైన‌ర్ వేర్ ని రూపొందించార‌‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. ప్ర‌కృతి నుంచి భూచ‌రాలు స‌ముద్ర చ‌రాలు ఇత‌ర‌ జీవ‌జాలం నుంచి స్ఫూర్తి పొంది డిజైన‌ర్లు దుస్తుల్ని డిజైన్ చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. డిజైన‌ర్ల క్రియేటివిటీకి జంతు జీవ‌జాలం ఎంతో ఉప‌యుక్తం అన్న‌మాట‌.