Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ కానుకగా డబుల్ సర్ప్రైజ్ ఇచ్చిన 'ఖిలాడీ' టీమ్..!

By:  Tupaki Desk   |   1 Jan 2021 3:39 PM IST
న్యూ ఇయర్ కానుకగా డబుల్ సర్ప్రైజ్ ఇచ్చిన ఖిలాడీ టీమ్..!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఖిలాడి'. 'ప్లే స్మార్ట్' అనేది ఈ సినిమా ట్యాగ్‌ లైన్‌. 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ అధినేత జయంతి లాల్‌ గడ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మరియు డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'ఖిలాడీ' చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'ఖిలాడీ' లో ర‌వితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్ రవితేజ నటిస్తున్న రెండు పాత్రలను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. ఇందులో ఒక రవితేజ మరో రవితేజ తలకు గన్ గురి పెట్టి ఉన్నాడు. ఒకరు కోపంగా చూస్తూ ఉండగా మరొకరు భయపడుతూ కనిపిస్తున్నాడు. ఒక పోస్టర్ లోనే గుడ్ మరియు బ్యాడ్ క్యారెక్టర్స్ గురించి వెల్లడించిన మేకర్స్ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా'ఖిలాడీ' చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'లూసిఫ‌ర్' సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్‌.. ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్ వంటి టాప్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమా కోసం ప‌నిచేస్తున్నారు. శ్రీ‌కాంత్ విస్సా - దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ కలసి డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తుండగా.. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు.