Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `ఖిలాడి`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

By:  Tupaki Desk   |   5 March 2022 3:28 AM GMT
ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `ఖిలాడి`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!
X
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై హవీష్ కోనేరు, సత్యనారాయణ కోనేరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, అనసూయ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చారు.

భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగిన చిత్ర‌మిది. సినిమాలో ట్విస్ట్‌లు ఎక్కువ‌గానే ఉంటాయి.. కానీ, మ్యాట‌ర్ బాగా త‌క్కువ ఉంటుంది. ఇక ర‌వితేజ ఎన‌ర్జిటిక్ పెర్ఫార్మన్స్, హీరోయిన్ల గ్లామ‌ర్ షో, యాక్షన్‌ సీక్వెన్స్ వంటి అంశాలు మాత్రం ఆక‌ట్టుకున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చిన త‌ర్వాత థియేటర్‌లో రిలీజైన సినిమాలు కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఖిలాడీ మూవీ సైతం ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం యొక్క‌ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ సాలిడ్ ధ‌ర‌కు ద‌క్కించుకుంది.

థియేట‌ర్స్‌లో దిగిన వారానికే ఖిలాడి డ‌ల్ అయిపోయింది. దీంతో విడుదలైన 28 రోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదిక‌గా అందుబాటులోకి తెస్తున్నారు. మార్చి 11న ఖిలాడీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని హాట్‌స్టార్ వారు అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రి థియేట‌ర్స్‌లో బోల్తా ప‌డిన ఖిలాడి.. ఓటీటీలో అయినా హిట్ అవుతుందో.. లేదో.. చూడాలి.