Begin typing your search above and press return to search.

వినాయక చవితికి 'ఖిలాడి' మ్యూజిక్ ఫెస్ట్..!

By:  Tupaki Desk   |   6 Sep 2021 8:07 AM GMT
వినాయక చవితికి ఖిలాడి మ్యూజిక్ ఫెస్ట్..!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఖిలాడి''. 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వంలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌధ‌రి - డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ మాస్ రాజా నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా మ్యూజిక్ ఫెస్టివల్ స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

'ఖిలాడి' చిత్రం నుంచి 'ఇష్టం' అనే ఫస్ట్ సింగిల్ ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా హీరోయిన్ తో కలిసి స్టెప్పులేస్తున్న రవితేజ పోస్టర్ ని వదిలారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ప్రోమోని ఇటీవల విడుదల చేయగా.. మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. దేవిశ్రీ తమ్ముడు సాగర్ డైలాగ్స్ రాస్తున్నారు. సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సౌత్ ఇండస్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మరియు అన్బు-అరివు మాస్ట‌ర్స్ 'ఖిలాడి' చిత్రానికి యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ - అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ జయంతీలాల్‌ గడ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.