Begin typing your search above and press return to search.

టీజర్: ఉత్కంఠ‌భ‌రితంగా మాస్ రాజా హై ఓల్టేజ్ యాక్షన్ 'ఖిలాడి'

By:  Tupaki Desk   |   12 April 2021 5:00 AM GMT
టీజర్: ఉత్కంఠ‌భ‌రితంగా మాస్ రాజా హై ఓల్టేజ్ యాక్షన్ ఖిలాడి
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ నటిస్తున్న లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ''ఖిలాడి''. 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ జయంతీలాల్‌ గడ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌధ‌రి - డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఉగాది కానుక‌గా తాజాగా 'ఖిలాడి' టీజర్ ను చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది.

'ఖిలాడి' టీజర్ చూస్తుంటే ర‌వితేజ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ జైలులో ఉండటం.. సుత్తి పట్టుకుని క్రూరంగా మనుషులను వేటాడటం చూస్తుంటే అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని అనుమానం కలుగుతోంది. ''మీరు స్టుపిడ్ ఎమోషన్స్ లేకుండా స్మార్ట్ గా ఆడితే.. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు'' అని చెప్పే డైలాగ్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. ఇందులో రవితేజ స్టైలిష్ గా ఉన్నారు. అంతేకాదు ఇంతకముందు చేయని క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడని అర్థం అవుతుంది.

హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ యాక్షన్ పాకెడ్ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. అలానే సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇందులో యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. యాంకర్ అనసూయ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషించారు.

ఇకపోతే 'ఖిలాడి' చిత్రానికి సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మరియు అన్బు-అరివు మాస్ట‌ర్స్ యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. గాంధీ న‌డికుడిక‌ర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌ గా ప‌నిచేస్తున్నారు. శ్రీ‌కాంత్ విస్సా మరియు దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ కలసి డైలాగ్స్ రాస్తున్నారు. లిరిసిస్ట్ శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. ఇటీవ‌ల ఇటలీలో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.