Begin typing your search above and press return to search.

అందుకే 'ఖిలాడి' టెన్షన్ పడుతున్నాడట!

By:  Tupaki Desk   |   21 Sep 2021 7:34 AM GMT
అందుకే ఖిలాడి టెన్షన్ పడుతున్నాడట!
X
ఎప్పుడు చూసినా రవితేజ ఫోకస్ తన సినిమాలపైనే కనిపిస్తుంది. అనవసరమైన విషయాలను ఆయన అంటించుకోడు .. పెద్దగా పట్టించుకోడు. ఎంత ఫాస్టుగా కథలను ఓకే చేస్తున్నాం .. ఎంత తొందరగా పూర్తి చేస్తున్నాం అనే విషయం పైనే ఆయన పూర్తి దృష్టి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఆయన తన సినిమాల మధ్య గ్యాప్ రానీయడు. తనకి తెలిసింది యాక్టింగ్ మాత్రమే అని భావించే రవితేజ, ఇతర విషయాలను గురించిన ఆలోచన చేయడు .. ప్రయోగాల జోలికివెళ్లడు.

ఆయన తాజా చిత్రంగా 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆయా కారణాల వలన ఈ ప్రాజెక్టుకు సినిమాటోగ్రఫర్ లను మారుస్తూ వెళ్లారట. ముందుగా సుజీత్ వాసుదేవ్ .. ఆ తరువాత జీకే విష్ణు ఈ సినిమాకి సినిమాటో గ్రాఫర్ లుగా పనిచేశారు. ఆ తరువాత మరో డీఓపీని తీసుకున్నారట. కొత్తగా వచ్చినవారు కుదురుకునే సరికి సమయం పట్టేస్తుంది. అందువలన ఈ సినిమా షూటింగు విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అనుకున్న సమయానికి పూర్తిచేయగలమా? లేదా? అని టెన్షన్ పడుతున్నారట.

దాదాపు దసరా బరిలోకే ఈ సినిమాను దింపాలని ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగానే పనులను పరిగెత్తిస్తున్నారు. కుదరకపోతే దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు. సచిన్ కేడ్కర్ .. ముఖేశ్ రుషి .. ఉన్ని ముకుందన్ .. రావు రమేశ్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్న రవితేజ, నక్కిన త్రినాథరావు సినిమాను కూడా లైన్లో పెట్టేసిన సంగతి తెలిసిందే.