Begin typing your search above and press return to search.

'ఖిలాడీ' కొడితే ఆ బ్యూటీ వేగాన్ని ఆపేదెవ‌రు?

By:  Tupaki Desk   |   9 Feb 2022 5:30 AM GMT
ఖిలాడీ కొడితే ఆ బ్యూటీ వేగాన్ని ఆపేదెవ‌రు?
X
ఖిలాడీ`లో మాస్ రాజా ర‌వితేజ‌తో లిప్ లాక్ స‌న్నివేశాల్లో చెల‌రేగిన మీనాక్షి చౌద‌రి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తొలి సినిమా `ఇచ్చట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు` తో యావ‌రేజ్ స‌క్సెస్ అందుకున్న బ్యూటీ `ఖిలాడీ` లో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తోంది. అటుపై లిప్ లాక్ ల‌పై మీనాక్షి చేసిన హాట్ కామెంట్లు అంత‌కు మించి వైర‌ల్ గా మారాయి.

మేక‌ప్ వేసుకోవ‌డానికి ముందే లిప్ లాక్ స‌న్నివేశాల్లో ఆరితేరిపోయాను అన్న రేంజ్ లో క్లాస్ తీసుకుంది. సినిమా ఇండ‌స్ర్టీకి రావ‌డానికి ముందే అన్ని ర‌కాలు గా సిద్ద‌ప‌డి వ‌చ్చాన‌ని.. యాక్టింగ్ క్లాసుల్లోనే లిప్ లాక్ ల్లో ఎలాంటి హ‌వ‌భావాలు ప‌లికించాలో టీచ‌ర్లు బోధించార‌ని..ఆ ర‌కంగా ముందే స‌న్న‌ద‌మైన‌ట్లు తెలిపింది.

`ఖిలాడీ` క‌థ విన్న‌ప్పుడు క‌మ‌ర్శియ‌ల్ స్ర్కిప్ట్ లో ఎలాంటి అంశాలు జోడించి ఉంటారో ముందే ఊహించ‌గ‌ల‌న‌ని చెప్పుకొచ్చింది. ఖిలాడీ విష‌యంలో ర‌వితేజ స‌హ‌కారం బాగుంద‌ని..భ‌య‌ప‌డుతుంటే కంప‌ర్ట్ టైమ్ తీసుకుని చేయ‌మ‌ని రాజా చెప్పేవార‌ని తెలిపింది. అలా ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాల‌ స‌మ‌యంలో మంచి అండ‌ర్ స్టాండింగ్ కుదిరింద‌ని అంది.

ఇలా `ఖిలాడీ` రిలీజ్ కి ముందే అమ్మ‌డు నెట్టింట క్రేజీ భామ‌గా మారిపోయింది. ఇక అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ ల లైన‌ప్ కూడా అంతే క్రేజీగా ఉంది. స‌లార్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న సెకెండ్ హీరోయిన్ ఛాన్సెస్ కూడా త‌న‌వే అంటోంది. ప్రాజెక్ట్ క‌న్ప‌ర్మ్ కాలేదు గానీ..తానే ఖ‌రారైన‌ట్లు మాట‌ల్ని బట్టి తెలుస్తోంది.

ఇంకా అడ‌వి శేష్ స‌ర‌స‌న `హిట్ -2` లో న‌టిస్తోంది. మొద‌టి భాగం హిట్ పెద్ద విజ‌యం సాధించ‌డంతో `హిట్ -2`పై మంచి అంచ‌నాలున్నాయి. ఇంకా మ‌రో రెండు మూడు ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో విజ‌య్ అంటోనీ స‌ర‌స‌న `కొలై` అనే సినిమాలో న‌టిస్తోంది. ఇలా కెరీర్ బినిగింగ్ లో హర్యానా బ్యూటీ దూసుకుపోతుంది. చెప్పుకోద‌గ్గ భారీ స‌క్సెస్ లేక‌పోయినా అవ‌కాశాల ప‌రంగా ముంద‌జ‌లోనే ఉంది.

`ఖిలాడీ` స‌క్సెస్ అయితే గ‌నుక అమ్మ‌డి కెరీర్ ఇంకా ట‌ర్న్ తీసుకుంటుంది. రొమాంటిక్ స‌న్నివేశాల విష‌యంలో ఎలాంటి పరిమితులు విధించుకోలేద‌ని హింట్ ఇచ్చేసింది కాబ‌ట్టి టాలీవుడ్ లో మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.