Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిన ఖిలాడి బ్యూటీ..!

By:  Tupaki Desk   |   4 July 2021 1:30 AM GMT
బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిన ఖిలాడి బ్యూటీ..!
X
'గల్ఫ్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ డింపుల్ హయాతి.. ఆ తర్వాత 'యురేక' అనే చిత్రంలో నటించింది. 'అభినేత్రి 2' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో 'గడ్డలకొండ గణేష్' చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే వ‌చ్చిన అవ‌కాశాలన్నిటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌కుండా.. స్టార్స్ స‌ర‌స‌న న‌టించ‌డానికే ఈ బ్యూటీ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.

ప్ర‌స్తుతం మాస్ మహారాజా ర‌వితేజ కు జోడీగా 'ఖిలాడి' సినిమాలో న‌టిస్తోంది. జయంతీలాల్‌ గడ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీలో పెన్ స్టూడియోస్‌ బ్యానర్ పై విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డింపుల్ హయతి బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిందని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ - బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కాంబోలో పెన్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న 'అపరిచితుడు' హిందీ రీమేక్ లో డింపుల్ కి ఓ కీల‌క పాత్ర ఇవ్వ‌నున్న‌ట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఆ రోల్ ఏంట‌న్న‌ది ప్ర‌స్తుతానికి ఇంకా క్లారిటీ రావడం లేదు.

ఇకపోతే బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ అప్ కమింగ్ సినిమాలో కూడా డింపుల్ హయతి ని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. అలానే తమిళ్ లో విశాల్ హీరోగా నటిస్తున్న 31వ చిత్రంలో అమ్మడు ఫీమేల్ లీడ్ ప్లే చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఈ బ్యూటీ గెస్ట్ రోల్ లో మెరవనుందని టాక్.