Begin typing your search above and press return to search.

పాట షూట్‌ లో మాస్ ఖిలాడీ

By:  Tupaki Desk   |   14 Dec 2021 10:07 AM GMT
పాట షూట్‌ లో మాస్ ఖిలాడీ
X
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఖిలాడీ. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని అంతా అనుకుంటున్నారు. కాని చివరి పాట ఒకటి బ్యాలన్స్ ఉందని.. ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణ జరుపుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఖిలాడీ పాట చిత్రీకరణలో రవితేజ బిజీగా ఉన్నాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ అందిస్తున్న ఈ పాటలో రవితేజ మాస్ స్టెప్పులు ఆడియన్స్ ను అలరించబోతున్నాయి.

రవితేజ తో పాటు ఈ పాటలో మీనాక్షి కనిపించబోతుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాట మాస్ ఆడియన్స్ కు ఖచ్చితంగా కిక్కు ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ పాట చిత్రీకరణ తో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందని సమాచారం.

ఖిలాడి సినిమాలో రవితేజ లుక్ ఇప్పటికే రివీల్‌ అయ్యింది. రమేష్ వర్మ దర్శకుడిగా మొదటి సక్సెస్ తర్వాత రవితేజతో ఖిలాడి సినిమాను చేస్తున్నాడు. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా నిరాశ పర్చినా ఈ సారి మాత్రం పక్కా సక్సెస్ అవుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలున్న

ఈ సినిమాను రమేష్ వర్మ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. రవితేజను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. రవితేజ గత చిత్రం క్రాక్‌ తర్వాత రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

రవితేజ నటిస్తున్న ఈ మాస్ మసాలా సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 11న విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత రవితేజ వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.

మరో వైపు ధమాకా.. టైగర్ నాగేశ్వరరావు మరియు రావణసుర సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ మొత్తం సినిమాలు కూడా రాబోయే రెండేళ్లలో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఇవి కాకుండా మరి కొన్ని కూడా చర్చల దశలో ఉన్నాయి.