Begin typing your search above and press return to search.

కామెడీ మసాజ్ మిస్సయ్యింది

By:  Tupaki Desk   |   16 Sep 2017 11:31 AM GMT
కామెడీ మసాజ్ మిస్సయ్యింది
X
సినిమాల్లో కొందరి కమెడియన్స్ చేసే పాత్రలు ఎన్నాళ్లెకైనా అలానే ఉండిపోతాయి. ఎంతోమంది నటి నటులు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరే ఎప్పటికి మర్చిపోని విధంగా పాత్రలను చేసి వారికంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. అటువాంటి కమెడియన్స్ లో టాలీవుడ్ కామెడీ కింగ్ ఆలీ ఒకరు. అయన చేసిన పాత్రలెన్నో టాలీవుడ్ లో ఇప్పటికి ప్రేక్షకులని నవ్విస్తూ ఉంటాయి.

అలాగే ఆయన అప్పుడపుడు మాట్లాడే బాషా కూడా ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటుంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "చిరుత" సినిమాలో ఆలీ చేసిన నచిమి అనే పాత్ర చాలా ఫెమస్ అయినా విషయం అందరికి తెలిసిందే. అందులో మసాజ్ చేసే పాత్ర ఎన్ని సార్లు చూసినా ఆ కామెడీ ప్రేక్షకులను ఇంకా ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆ పాత్ర మరికొన్ని సినిమాల్లో కూడా చేశాడు ఆలీ. అయితే అసలు విషయంలోకి వస్తే ఆలీ సోదరుడు ఖయ్యుమ్ కూడా రీసెంట్ గా వీడెవడు అనే సినిమాలో సేమ్ ఇదే తరహాలో నచిమి అనే పాత్రను గుర్తు చేశాడు.

చిరుతలో అక్కడ ఆలీ బ్యాంకాక్ లో ఉంటే ఇక్కడ వీడేవాడు సినిమాలో ఖయ్యుమ్ గోవాలో శాంసంగ్ అనే పాత్ర తరహాలో అలరించే ప్రయత్నం చేశాడు. కానీ ఆలీ స్థాయిలో మెప్పించలేకపోయాడు. సచిన్ జోషి - ఈషా గుప్తా నటించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. సినిమా కూడా పూర్తిగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.