Begin typing your search above and press return to search.
ఈ దీపావళికి ఖాన్ రిలీజయ్యాడు
By: Tupaki Desk | 30 Oct 2021 4:00 PM ISTవ్యవస్థలో అనాదిగా వేళ్లూనుకుని ఉన్న అవ్యవస్థను ప్రశ్నించేందుకు ఆర్జీవీ ఎన్నుకున్న మార్గం వేరు. ఆయనకు ఉన్న తాంత్రిక సైకాలజికల్ ఫిలాసఫికల్ ఐడియాలజీతో సంఘాన్ని విశ్లేషిస్తూ దేనిపై ఎలాంటి కౌంటర్ వేయాలన్నది ప్లాన్ చేస్తుంటారు. సూటిగా సుత్తి లేకుండా తాను మనసులో అనుకున్నది బయటికి అనేస్తూ వివాదాలకు తెర తీయడం ఆయన నైజం.
ఇప్పుడు ఖాన్ లపై అతడు వేసిన పంచ్ మామూలుగా లేదు. బాలీవుడ్ లో ఖాన్ లు ప్రతిసారీ దీపావళి రిలీజ్ కి కర్చీఫ్ వేసేస్తుంటారని ఈసారి దీపావళికి కూడా ఖాన్ రిలీజయ్యాడని తనదైన శైలిలో పంచ్ వేశాడు ఆర్జీవీ. ఇది ఎవరిని ఉద్ధేశించో గెస్ చేయాల్సిన పని లేదు. కచ్ఛితంగా కింగ్ ఖాన్ షారూక్ వారసుడు ఆర్యన్ ఖాన్ పైనే ఆర్జీవీ ఇలా స్పందించారని అర్థమవుతోంది. ఆర్యన్ కి నేడు కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బాంద్రాలోని తన ఇంటికి రాగానే అభిమానులు డోలు భాజా మోగించి తమ ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పటికే అనన్య పాండే .. షానయ కపూర్ సహా స్నేహితులు ఆర్యన్ ని కలిసారు.
డ్రగ్స్ కేసులో షారూక్ కుమారుడిని ఎన్సీబీ అరెస్టు చేయడాన్ని ఆర్జీవీ సమర్థించారు. అతడికి బెయిల్ వచ్చేస్తోంది అనగానే `డబ్బు లేని వాళ్ల పరిస్థితి ఏమిటీ? ` అంటూ ప్రశ్నించాడు వర్మ. ఇప్పుడు దీపావళి పేరుతో సెటైర్ వేశారు. ఆర్యన్ ఖాన్ త్వరగా జైలు నుంచి రిలీజ్ కావాలని సల్మాన్ ఖాన్ .. అమీర్ ఖాన్ సహా ఎందరో స్టార్లు కింగ్ ఖాన్ కి బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే.