Begin typing your search above and press return to search.

ఇతడే నా లవ్ అంటూ టీజ్ చేసిన‌ ఖాన్ డాట‌ర్

By:  Tupaki Desk   |   29 Jun 2021 10:30 AM GMT
ఇతడే నా లవ్ అంటూ టీజ్ చేసిన‌ ఖాన్ డాట‌ర్
X
సెల‌బ్రిటీ డాట‌ర్స్ ప్రేమ‌క‌థ‌ల‌కు అభిమానుల్లో ఉండే క్రేజు అంతా ఇంతా కాదు. ఇటీవ‌లే బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె త‌న బోయ్ ఫ్రెండ్ ని ప‌బ్లిక్ కి ప‌రిచ‌యం చేసింది. త‌నకు జిమ్ కోచ్ గా వ్య‌వ‌హ‌రించిన నూపుర్ శిఖారే ని ప్రేమిస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది. అతడితో రొమాంటిక్ ఫోటోల‌ను ఇరా ఖాన్ షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే షాహిద్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. అలాగే మ‌రో న‌ట‌వార‌సురాలు సారా అలీఖాన్ ఇటీవ‌ల మ‌ర‌ణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేశారు.

ఇక కింగ్ ఖాన్ షారూక్ వార‌సురాలు సుహానా ఖాన్ తాజాగా `ఇత‌డే నా బోయ్ ఫ్రెండ్` అంటూ టీజ్ చేసిన ఓ ఫోటో ఫ్యాన్స్ పేజ్ ద్వారా వైర‌ల్ అయ్యింది. దీంతో నిజంగానే సుహానా ల‌వ్ లో ప‌డిందా? అంటూ అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అత‌డు విదేశీ బోయ్ ఫ్రెండ్. త‌న‌తో పాటు న్యూయార్క్ ఫిలిం అకాడ‌మీలో చ‌దువుకున్నాడు. త‌న స్నేహితుల బృందం స‌భ్యుడు కూడా. అయితే అత‌డు బోయ్ ఫ్రెండేనా లేక ప్రేమికుడు కూడానా? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు. సుహానా జ‌స్ట్ టీజ్ చేసింద‌ని భావించాల్సి ఉంటుంది.

సుహానాను ఇన్ స్టాలో సుమారు 1.9 మిలియన్ ఫాలోవర్స్ అనుస‌రిస్తుండ‌గా వారిలో త‌న ప్రియుడి గురించి హాట్ డిబేట్ సాగుతోంది. మ‌రోవైపు సుహానా క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. షారూక్ - గౌరీ ఖాన్ ఇంత‌కుముందే సుహానా క‌థానాయిక అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే న‌ట‌శిక్ష‌ణ పూర్తి చేసుకుని స్టేజీడ్రామాల్లోనూ న‌టించిన సుహానా ఆక‌ట్టుకుంది.