Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ క్ల‌బ్ కి చిక్కిన ఖాన్ డాట‌ర్ బికినీ ఫోటో.. ఇంకేం ఉంది పండ‌గే!!

By:  Tupaki Desk   |   27 May 2021 6:43 AM GMT
ఫ్యాన్స్ క్ల‌బ్ కి చిక్కిన ఖాన్ డాట‌ర్ బికినీ ఫోటో.. ఇంకేం ఉంది పండ‌గే!!
X
షారూఖ్ - గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ న్యూయార్క్ లో తన హ్యాపీ లైఫ్ ని గడుపుతున్న సంగ‌తి తెలిసిందే. న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయానికి సుహానా స్ట‌డీస్ కోసం వెళుతున్నారు. తరచుగా త‌న‌ ఇన్ స్టా లో చిల్లింగ్ లైఫ్‌ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తున్నారు.

సుహానా తన స్నేహితులతో క‌లిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తుంటారు. తాజాగా క్రొత్త ఫోటోలను సుహానా ఖాన్ పుట్టినరోజు వేడుకల నుండి షేర్ చేయ‌గా వాటిలో ఒక స్పెష‌ల్ ఫోటో అభిమానుల్ని ఆక‌ర్షించింది. అమెరికాలో త‌న బెస్ట్ ఫ్రెండ్స్ తో సుహానా బోట్ షికార్ కి వెళ్లార‌ని ఈ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఒక చిన్న విహార‌ యాత్ర అయినా బ్లాస్టింగ్ ఫోటోషూట్లు వెబ్ లో మంట‌లు పెడుతున్నాయి.

సుహానా తన స్నేహితురాలు అలానా మార్కెల్ పోస్ట్ చేసిన బ్లింక్-అండ్-మిస్ ఫోటోలో కనిపించింది. తరువాత ఈ పోస్ట్ ను తొలగించారు. అయితే ఆ ఫోటో అభిమానుల క్లబ్ లకు చిక్కింది. వారంతా తిరిగి షేర్ చేస్తున్న ఓ ఫోటో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో సుహానా బికినీ ధరించి ఫుల్ సెల‌బ్రేష‌న్ మోడ్ లో క‌నిపించారు. సుహానా తన స్నేహితులతో జాకుజీలో పడవలో వేడుక‌ల్ని ఆస్వాధిస్తున్నారు. సుహానా పార్టీ లైఫ్ కి ఇది సింబాలిక్ గా క‌నిపించింది.

ఆదివారం సుహానా తన 21 వ పుట్టినరోజును సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇప్ప‌టికే సుహానా ఫ్యాష‌నిస్టాగా పాపుల‌ర‌వుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ర‌క‌ర‌కాల‌ కటౌట్ లతో క‌నిపించారు. ముఖ్యంగా పాస్టెల్ బాడీకాన్ డ్రెస్ లో ప్రతి బిట్ అద్భుతంగా కనిపించారు.

సుహానా ఖాన్ షారూఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ జంట కుమార్తె. ఆమె న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళుతుంది. నటి కావాలని కోరుకుంటోంది. గత సంవత్సరం సుహానా ఖాన్ న్యూయార్క్ నుండి ముంబైకి తిరిగి వెళ్లి తన తల్లిదండ్రులతోనే నెలల పాటు గడిపారు.ముంబైలో నవ్య నవేలి నందా- అనన్య పాండే - షానయ కపూర్ త‌న బెస్ట్ బ‌డ్డీస్ అన్న సంగ‌తి తెలిసిందే. ముంబైకి వ‌స్తే పార్టీలు షికార్లు వీళ్ల‌తోనే సుమీ!