Begin typing your search above and press return to search.

సైకో మార్కు హారర్ - టీజర్ టాక్

By:  Tupaki Desk   |   10 May 2019 4:15 PM IST
సైకో మార్కు హారర్ - టీజర్ టాక్
X
ఈ మధ్య కాలంలో సౌత్ తో పాటు నార్త్ లో సైతం హారర్ సినిమాల ఉధృతి తగ్గింది. అందులోనూ వీటిలో కామెడీ ఎక్కువైపోయక జనం భయపడటం మానేశారు. అందుకే ఆ కొరత తీర్చేందుకు కాబోలు ప్రభుదేవా తమన్నాలు ఖామోషితో వస్తున్నారు. ఇందాక టీజర్ రిలీజైంది. నిమిషంలోనే థీమ్ ని రివీల్ చేశారు.

ఓ పెద్ద ఎస్టేట్ బంగళా. అందులో ఒంటరిగా ఉండే తమన్నా. తనకు మాటలు వినిపించవు. సైకో కిల్లర్ ప్రభుదేవా కన్ను తన మీద పడుతుంది. ఎలాగైనా హత్య చేయాలని డిసైడ్ అవుతాడు. భవంతిలోకి అడుగు పెడతాడు. ఇద్దరి మధ్య నిశబ్దంలో ఒకరి నుంచి ఒకరు తప్పించుకోవడం కోసం వేట మొదలవుతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు. మరి తమన్నా ఈ డేంజర్ గేమ్ నుంచి ఎలా తప్పించుకుంది అనేదే ఖామోషి

టీజర్ లో కొత్తదనం ఏమి లేదు. గతంలో ఎన్నో హారర్ సినిమాల చాయలు కనిపిస్తాయి. హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళకు ఇంకా రొటీన్ గా అనిపిస్తుంది. ఇలాంటి పాత్రలో ప్రభుదేవా గతంలో మెర్క్యూరీలో నటించాడు. తమన్నాకు అభినేత్రి లాంటివి చేసింది కనక తనకూ అలవాటే.

మరి కంటెంట్ గొప్పగా లేకపోయినా ప్రెజెంటేషన్ ఎలా చేశారు అనే దాన్ని బట్టి ఇది మెప్పించడం ఆధారపడి ఉంటుంది. దీనికి దర్శకుడు చక్రి తోలేటి. మన తెలుగు వాడే. గతంలో ఈనాడు-డేవిడ్ బిల్లా తీశాడు. ఇప్పుడీ ఖామోషితో ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న ఈ ఖామోషిలో భూమిక మరో కీలక పాత్ర పోషిస్తోంది