Begin typing your search above and press return to search.

ఒకే రోజు మిల్కీ డబుల్ బొనంజా

By:  Tupaki Desk   |   7 May 2019 10:01 AM IST
ఒకే రోజు మిల్కీ డబుల్ బొనంజా
X
మొన్నటి దాకా గ్లామర్ షోలతో స్టార్ హీరోల సరసన డాన్సులతో అదరగొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా అభినేత్రి నుంచి రూటు మార్చుకుంది. అది మంచి పేరు కూడా తీసుకొచ్చింది. ఇదేదో బాగుందని కాబోలు కథ నచ్చితే చాలు హారర్ జానర్ లో చేసేందుకు తమన్నా వెనుకాడటం లేదు. ఈ నెల 31న తన కొత్త సినిమా ఖమోషి హిందిలో విడుదల కానుంది. ఇది ఫక్తు హారర్ మూవీ. కామెడీ లేకుండా సీరియస్ గా సాగే కథాంశంతో రూపొందింది. ఇందులో తమన్నా మూగదానిలా నటించడం విశేషం.

ఎంసిఎలో వదినగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భూమిక మరో కీలక పాత్ర పోషించింది. లండన్ నేపధ్యంలో సాగే ఈ కథలో ప్రభుదేవా పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందట.గృహం తర్వాత అంత ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్టుగా దీని మీద బజ్ ఉంది. కమల్-వెంకీలతో ఈనాడు అజిత్ తో డేవిడ్ బిల్లా తీసిన చక్రి తోలేటి దీనికి దర్శకుడు

ఇదిలా ఉండగా ఖమోషి విడుదలవుతున్న రోజే ప్రభుదేవా-తమన్నాల అభినేత్రి 2 కూడా విడుదల కానుండటం విశేషం. ఇలా ఒకే జంట నటించిన రెండు దెయ్యాల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం బహుశా ఇదే మొదటిసారేమో. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కి ఇలా జరగడం సహజమే కాని ఇలా భయపట్టే భూతల సినిమాల ద్వారా తమన్నా-ప్రభుదేవా ఒకేరోజు పలకరించబోవడం మాత్రం విశేషమే. ఖామోషిని తెలుగు తమిళ్ లో డబ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారో లేదో ఇంకా క్లారిటీ లేదు. మిల్కీ ఫ్యాన్స్ మాత్రం ఒకేరోజు డబుల్ బొనంజా ఎంజాయ్ చేయబోతున్నారు