Begin typing your search above and press return to search.

ఖైదీ నెం 150.. 1 మిలియన్ కొట్టేస్తాడా??

By:  Tupaki Desk   |   11 Jan 2017 3:59 AM GMT
ఖైదీ నెం 150.. 1 మిలియన్ కొట్టేస్తాడా??
X
అబ్బే ఫుల్ రన్ లో 1 మిలియన్ డాలర్ల అమెరికా బాక్సాఫీస్ కలక్షన్ గురించి కాదండోయ్.. ఇక్కడ అసలు ప్రీమియర్లతోనే ''ఖైదీ నెం150'' చెలరేగిపోతున్నాడు. ఒక ప్రక్కన అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటుంటే.. అసలు బాస్ బ్యాక్ కు ఎప్పుడెళ్లాడు ఏదో జస్ట్ బ్రేక్ మాత్రమే తీసుకున్నాడు అన్న చందాన ఉంది మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ. ముఖ్యంగా అమెరికా బాక్సీఫీస్ ను ఆయన శాసిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.

దాదాపు 90+ లొకేషన్లలో ఇండియాలో రాత్రి 2 గంటలు అయ్యేసరికి.. అంటే అమెరికాలో 10వ తేదీ మధ్యాహ్నం రెండున్నర అయ్యేసరికి.. మెగాస్టార్ ఖైదీ ఆల్రెడీ 6,00,000 డాలర్ల మార్క్ దాటేసింది. 91 లొకేషన్ల నుండి 6,00,938 డాలర్లు వసూలు చేశాడు. అంటే హాఫ్‌ మిలియన్ దాటేసి ఇంకా పరిగెత్తేస్తోందనమాట. ఇప్పటివరకు బాహుబలి కాకుండా మరే తెలుగు సినిమా కనీసంలో కనీసం 700 డాలర్ల మార్కును టచ్ చేయలేదు. ఆ లెక్కన చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి ఇక్కడేదో కొత్త రికార్డును నెలకొల్పేలా ఉ్నారు.

మన తెలుగు సినిమాల వరకు చూసుకుంటే ఇప్పటివరకు బాహుబలి అత్యధికంగా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకుని 14,70,000 డాలర్లు (1.47 మిలియన్) వసూలు చేయగా.. తరువాత సర్ధార్ 6,43,000 డాలర్లు.. జనతా గ్యారేజ్ 5,85,000.. శ్రీమంతుడు 5,65,000 డాలర్లను వసూలు చేశాయి. ఆల్రెడీ రెండో స్థానంలో సెటిల్ అయిపోయిన ఖైదీ.. మరి తొలి స్థానాన్ని టచ్ చేస్తాడా లేదా అనే విషయం కాస్త చూడాల్సిందే.

బహుశా తమిళ కత్తిని మీరేం చేశారు అని మెగాస్టార్ ఫ్యాన్స్ ను అడిగితే.. మేం మరింత పదునెట్టి వదిలాం అందుకే ఇలా దూసుకుపోతోంది అని తెలుగు ప్రేక్షకులు చెప్పుకోవాలేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/