Begin typing your search above and press return to search.

సంక్రాంతికి మెగాస్టార్ డబుల్ ఎంట్రీ

By:  Tupaki Desk   |   4 Jan 2017 6:47 AM GMT
సంక్రాంతికి మెగాస్టార్ డబుల్ ఎంట్రీ
X
ఈ సారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత చిరు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుండడంతో.. తెలుగు ప్రేక్షకులు.. ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మెగాస్టార్ మళ్లీ తన స్టామినా చూపిస్తారని అంతా అనుకుంటున్న టైంలో.. చిరు స్మాల్ స్క్రీన్ పై కూడా బిగ్ ఎంట్రీకి సంక్రాంతినే టార్గెట్ చేశారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతోంది.

మీలో ఎవరు కోటీశ్వరుడు.. తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఈ కార్యక్రమం లేటెస్ట్ సిరీస్ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది కానీ.. ఒకేసారి డబుల్ ఎంట్రీ ఇవ్వాలనే టార్గెట్ తోనే.. ఇప్పటివరకూ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయలేదని తెలుస్తోంది. ఇటు జనవరి 11న ఖైదీ నంబర్ 150 రిలీజ్ కాగానే.. సంక్రాంతి నుంచి తన బుల్లితెర అరంగేట్ర కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు టెలికాస్ట్ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

జనవరి 11న ఖైదీ నంబర్ 150 థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి.. మీలో ఎవరు కోటీశ్వరుడు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే ప్రోమోలు టెలికాస్ట్ కానున్నాయట. అందుకే ఇన్నాళ్లూ ఈ ప్రోగ్రామ్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/