Begin typing your search above and press return to search.

సాంగ్ కి అన్ని వ్యూసా.. ఇదీ బాస్ రచ్చ

By:  Tupaki Desk   |   19 Dec 2016 5:30 PM GMT
సాంగ్ కి అన్ని వ్యూసా.. ఇదీ బాస్ రచ్చ
X
సాధారణంగా స్టార్ హీరోల సినిమా టీజర్లకు.. ట్రైలర్ లకు యూట్యూబ్ లో విపరీతంగా వ్యూస్ వచ్చేస్తుంటాయి. ఎన్ని గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్.. ఎన్ని రోజుల్లో ఎంతమంది చూశారు లాంటి లెక్కలేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 ఈ విషయంలో కేకలు పెట్టించేస్తోంది.

టీజర్.. ట్రైలర్ మాత్రమే కాకుండా.. కేవలం ఓ పాటకు.. అది కూడా ఆడియో సాంగ్ కి రికార్డ్ వ్యూస్ నమోదయ్యాయి. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అంటూ రిలీజ్ చేసిన ఆడియో సాంగ్ కు కేవలం 24 గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ దాటిపోయాయి. ఇప్పటివరకూ దాదాపు 22లక్షల వ్యూస్ సంపాదించుకున్న ఈ పాట.. యూట్యూబ్ లో ఇంకా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఓ ఆడియో సాంగ్ ఇంతలేసి రెస్పాన్స్ రావడం..మ్యూజిక్ రైట్స్ తీసుకున్న ఆడియో కంపెనీకి కూడా షాక్ ని ఇచ్చేసిందట.

ఇక ఖైదీ నెంబర్ 150 టీజర్ కి అయితే.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుపై ఉన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో 57 లక్షల వ్యూస్ వచ్చాయి. మొదటి వారంలోనే 50లక్షల వ్యూస్ దాటిపోయిన టీజర్ గా రికార్డుల్లోకి ఎక్కేసింది. ఇక మిగిలిన అప్ లోడ్స్ తో కలిపితే ఈ కౌంట్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది కానీ.. ఒరిజినల్ టీజర్ కు మాత్రమే కౌంటింగ్ చేసుకున్నా ఒక తెలుగు సినిమా టీజర్ కు ఇది రికార్డ్ వ్యూస్ గా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/