Begin typing your search above and press return to search.

అమ్మడితో కుమ్ముడు.. అదరగొట్టాడు..

By:  Tupaki Desk   |   18 Dec 2016 1:07 PM GMT
అమ్మడితో కుమ్ముడు.. అదరగొట్టాడు..
X
మెగా 150 కోసం ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో.. వాళ్ల ఆసక్తిని మరింతగా పెంచేందుకు ఖైదీ నెంబర్ 150 యూనిట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే టీజర్ తో రికార్డులను ఇరగ్గొట్టేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు మూవీలోని ఓ పాటను రిలీజ్ చేశారు. అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు.. అంటూ సాగే సింగిల్ ని ఇస్తామని చెప్పిన యూనిట్.. అందుకు తగ్గట్లుగానే ఆడియో కంపెనీ ద్వారా పాటను రిలీజ్ చేశారు.

'దిస్ ఈజ్ నాట్ మాస్ సాంగ్.. దిసీజ్ బాస్ సాంగ్' అంటూ దేవిశ్రీ వాయిస్ తో మొదలయ్యే పాట.. ఆ తర్వాత ఏ స్టేజ్ లోనూ కొంచెం కూడా స్లో అవదు. అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు.. అని హీరో అంటే... పిల్లడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ హీరోయిన్ మరింత రెచ్చగొట్టేస్తుందన్న మాట. సాంగ్ లోని స్టిల్స్ తోనే పాటను వీడియో రూపంలో విడుదల చేయడంతో మరింత ఆకర్షణ వచ్చేసింది. చిరంజీవి డ్రెస్సులు-స్టైలింగ్ కానీ.. కాజల్ అందాలు-చిందులు అన్నీ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

చివర్లో తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అని హీరోతో అనిపించడం వింటే.. ఆ ప్లేస్ లో దేవిశ్రీ ప్రసాద్ ని పట్టుకొచ్చి స్టెప్పులేయించారనే ఇండికేషన్ ఇచ్చారు. ఇక చివర్లో అయితే.. మెగాస్టార్ స్వయంగా 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' అంటూ పాటను ఫినిష్ చేయడం అయితే అదుర్స్ అంతే.