Begin typing your search above and press return to search.

`ఖైదీ` కొత్త‌త‌రం మేకింగ్.. మ‌హేష్ ప్ర‌శంస‌

By:  Tupaki Desk   |   2 Nov 2019 4:10 AM GMT
`ఖైదీ` కొత్త‌త‌రం మేకింగ్.. మ‌హేష్ ప్ర‌శంస‌
X
పాటలు- గ్లామ‌ర్ త‌ళుకులు.. అందాల ఆర‌బోత‌తో అల‌రించే హీరోయిన్ క‌నిపించ‌కుండా.. సినిమా అంతా హీరో ఒకే కాస్ట్యూమ్ తో న‌టించ‌డం సినీ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కూ లేదు. ఆ రూల్ ని బ్రేక్ చేస్తూ తెర‌పైకొచ్చిన చిత్రం `ఖైదీ`. కార్తీ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని లోకేష్ క‌న‌గ‌రాజ్ రూపొందించారు. ఈ దీపావ‌ళికి విజ‌య్ `విజిల్‌`తో పోటీప‌డుతూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం క‌ల్ట్ క్లాసిక్ గా నిలిచి ప్రేక్ష‌కులు క్రిటిక్స్ మెప్పుతో పాటు సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూల్ బ్రేకింగ్ టేకింగ్ తో తెర‌పైకొచ్చిన `ఖైదీ` గ‌త కొంత కాలంగా మంచి విజ‌యం కోసం ఎదురుచూస్తున్న హీరో కార్తీకి విజ‌యాన్నిఅందించి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమాపై టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మ‌ధ్య త‌న‌కు న‌చ్చిన చిత్రాల‌పై సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నమ‌హేష్‌ తాజాగా కార్తీ న‌టించిన `ఖైదీ` చిత్రంపై ప్ర‌సంశ‌లు కురిపించారు.``ఖైదీ` ఓ న్యూఏజ్ ఫిల్మ్ మేకింగ్‌. థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు- గ్రిప్పింగ్ స్క్రిప్ట్‌- క‌ళ్లు చెదిరే న‌ట‌న‌.. పైగా పాట‌లు లేకుండా ఆక‌ట్టుకున్నారు. స్వాగ‌తించాల్సిన ప్ర‌యోగ‌మిది`` అంటూ ప్ర‌శంసించారు. అంతా బాగానే ఉంది కానీ ఇలా పాటల్లేకుండా ఒకే కాస్ట్యూమ్ ఉన్న సినిమాలో మ‌హేష్ న‌టిస్తారా? అంటే అది ఇంపాజిబుల్ ఇప్ప‌టికి.

మ‌హేష్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `స‌రిలేరు నీకెవ్వరు` చిత్రంలో న‌టిస్తున్నారు. ఆర్మీ ఆఫీస‌ర్ గా మ‌హేష్ న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా రాముల‌మ్మ విజ‌య‌శాంతి రీఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ప్రొఫెస‌ర్ పాత్ర‌లో విజ‌య‌శాంతి.. హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో పోటీప‌డ‌బోతోంది.