Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 నుండి బిగ్‌ సర్‌ ప్రైజ్‌ రెడీ

By:  Tupaki Desk   |   25 July 2020 2:30 PM GMT
కేజీఎఫ్‌ 2 నుండి బిగ్‌ సర్‌ ప్రైజ్‌ రెడీ
X
సౌత్‌ ఆడియన్స్‌ తో పాటు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ స్థాయిలోనే కన్నడంలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కేజీఎఫ్‌ 2 పై కూడా అంచనాలు ఉన్నాయి. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్ర అయిన అధీర గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అధీర లుక్‌ రివీల్‌ అయ్యింది.

ఈనెల 29న సంజయ్‌ దత్‌ బర్త్‌ డే సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసేందుకు సిద్దం అయ్యారు. అందుకు గాను కేజీఎఫ్‌ 2 చిత్రం నుండి ఒక వీడియోను విడుదల చేయబోతున్నారు. 60 సెకన్లు ఉండబోతున్న ఆ వీడియోలో అధీర గా సంజయ్‌ దత్‌ కనిపించబోతున్నాడు. సంజయ్‌ దత్‌ పాత్రతో కేజీఎఫ్‌ 2 సినిమా స్థాయి పెరగడం ఖాయం అంటూ మొదటి నుండి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకం ప్రకారమే అధీర పాత్రను అత్యంత విభిన్నంగా పవర్‌ ఫుల్‌ గా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నాడట.

వచ్చే నెల నుండి కేజీఎఫ్‌ 2 చిత్రం షూటింగ్‌ ను పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కాని కరోనా కారణంగా షూటింగ్‌ జరగలేదు. దాంతో సినిమా విడుదల ఆలస్యం అవ్వబోతుంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాదిలోనే కేజీఎఫ్‌ 2 ను విడుదల చేయాలని ప్రశాంత్‌ నీల్‌ బలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.