Begin typing your search above and press return to search.

ఆ టీవీ ఛానల్ పై కేజీఎఫ్ నిర్మాతల ఫైర్!

By:  Tupaki Desk   |   13 May 2020 4:15 AM GMT
ఆ టీవీ ఛానల్ పై కేజీఎఫ్ నిర్మాతల ఫైర్!
X
సినీ ఇండస్ట్రీలో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా దేశంలో చరిత్ర సృష్టించింది కేజీఎఫ్ సినిమా. బాహుబలి తర్వాత దేశంలో ఆ రేంజ్ విజయం నమోదు చేసిందంటే మాములు విషయం కాదు. కన్నడ హీరో యశ్ ను స్టార్ హీరోగా స్టార్డమ్ అందిస్తూ.. తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందురు నిర్మించారు. 2018 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మాములు రచ్చ చేయలేదు ఇరగదీసిందనే చెప్పాలి. విడుదలైన అన్నీ బాషలలో మంచి విజయం అందుకుంది. అయితే కేజీఎఫ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఆధిక ధరకు కొనుగోలు చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇంతవరకు ఏ తెలుగు ఛానల్ కూడా కేజీఎఫ్ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయలేదట.

ప్రస్తుతం కేజీఎఫ్ సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి టాప్ చానెల్స్ అన్నీ పోటీ పడుతున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులు.. చర్చల దశలో ఉండగానే.. ఓ తెలుగు లోకల్ ఛానల్ కేజీఎఫ్ సినిమాను పర్మిషన్ లేకుండా ప్రసారం చేసిందట. ఈ విషయాన్నీ ఇటీవలే కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ తన ట్విట్టర్లో.. ఆ ఛానల్ ప్రసారం చేస్తున్న స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశారు. ఇలా సినిమా హక్కులు చర్చల దశలో ఉండగానే అక్రమంగా ప్రసారం చేయడం పై నిర్మాతలు మండిపడుతున్నారు. ప్రసారం చేసిన ఆ లోకల్ ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేజీఎఫ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది కాబట్టి సాటిలైట్ హక్కులు ఎవరు కొనలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్2 రాబోతున్న విషయం తెలిసిందే!