Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం టీవీలో ప్రసారం కానున్న బ్లాక్ బస్టర్ మూవీ!!

By:  Tupaki Desk   |   3 July 2020 11:30 AM GMT
ఫస్ట్ టైం టీవీలో ప్రసారం కానున్న బ్లాక్ బస్టర్ మూవీ!!
X
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన కేజీఎఫ్ సినిమా. బాహుబలి తర్వాత దేశంలో ఆ రేంజ్ విజయం నమోదు చేసిందంటే మాములు విషయం కాదు. కన్నడ హీరో యశ్ ను స్టార్ హీరోగా స్టార్డమ్ అందిస్తూ.. తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందురు నిర్మించారు. 2018 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మాములు రచ్చ చేయలేదు ఇరగదీసిందనే చెప్పాలి. విడుదలైన అన్నీ బాషలలో మంచి విజయం అందుకుంది. అయితే కేజీఎఫ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఆధిక ధరకు కొనుగోలు చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. మొన్నటి వరకు ఏ తెలుగు ఛానల్ కూడా కేజీఎఫ్ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయలేదట.

అయితే కేజీఎఫ్ సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి టాప్ చానెల్స్ అన్నీ పోటీ పడ్డాయి. ఇక ఈ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులు.. చర్చల దశలో ఉండగానే.. గతంలో ఓ తెలుగు లోకల్ ఛానల్ కేజీఎఫ్ సినిమాను పర్మిషన్ లేకుండా ప్రసారం చేసి వివాదంలో ఇరుక్కుంది. ఈ విషయాన్నీ కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ తన ట్విట్టర్లో తెలియజేసాడు. ఇలా సినిమా హక్కులు చర్చల దశలో ఉండగా ప్రసారం చేసిన ఆ లోకల్ ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం కేజీఎఫ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక తాజాగా సాటిలైట్ హక్కులను స్టార్ మా టీవీ ఛానల్ దక్కించుకుందట. మరో విషయం ఏంటంటే.. జులై 5న అంటే ఆదివారం కేజీఎఫ్ సినిమా ప్రసారం కానుందని ప్రకటించింది. ప్రస్తుతం కేజీఎఫ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్2 రాబోతున్న విషయం తెలిసిందే!