Begin typing your search above and press return to search.

2019 ఆల్‌ ఇండియా టాప్‌ మూవీ ఇదే

By:  Tupaki Desk   |   7 Dec 2019 11:19 AM GMT
2019 ఆల్‌ ఇండియా టాప్‌ మూవీ ఇదే
X
ఇప్పుడు వస్తున్న సినిమాలు కేవలం థియేటర్లల ద్వారా వచ్చే వసూళ్లను ఆధారంగా సక్సెస్‌ అని చెప్పలేక పోతున్నాం. బుల్లి తెర.. ఆన్‌ లైన్‌ లో ఇలా అన్నింటిని చూసిన తర్వాత ఏది బిగ్‌ హిట్‌.. ఏది బిగ్గెస్ట్‌ హిట్‌ అనే విషయాన్ని నిర్థారిస్తున్నారు. కొన్ని సినిమాలు వసూళ్ల పరంగా రికార్డు బద్దలు కొడుతుంటే కొన్ని శాటిలైట్‌ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మరికొన్ని ఆన్‌ లైన్‌ లో ఎక్కువ మంది చూసి రికార్డులు దక్కించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో కేజీఎఫ్‌ సినిమా మాత్రం అన్ని విధాలుగా టాప్‌ లో నిలిచింది.

వసూళ్ల విషయంలో కేజీఎఫ్‌ చిత్రం కన్నడ సినీ చరిత్రలో నిలిచి పోయేలా వసూళ్లు సాధించింది. అలాగే సౌత్‌ ఇండస్ట్రీలో టాప్‌ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక ఇప్పుడు కేజీఎఫ్‌ కు మరో అరుదైన రికార్డు దక్కింది. కన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ చిత్రం హిందీ.. తెలుగు.. తమిళంలో కూడా విడుదల అయ్యింది. ఈ నాలుగు భాషల్లో కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో కూడా ఈ నాలుగు భాషల్లో విడుదల అయ్యింది.

2018లో ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా వచ్చిన కేజీఎఫ్‌ చిత్రం 2019 వరకు కూడా జోరు కొనసాగించింది. ఈ ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌ లో ఇండియన్‌ సినిమాల్లో అత్యధిక వ్యూస్‌ ను దక్కించుకున్న సినిమాగా కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1 నిలిచింది. నాలుగు భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్‌ ను కేజీఎఫ్‌ దక్కించుకున్నాయని అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా అనధికారికంగా వెళ్లడించింది. ఈ విషయం ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ లు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్‌ కంటే రెండవ పార్ట్‌ మరింత భారీగా ఉండబోతుందట.