Begin typing your search above and press return to search.

శాండిల్ వుడ్ లో కేజీఎఫ్ రికార్డు

By:  Tupaki Desk   |   2 Dec 2018 1:30 AM GMT
శాండిల్ వుడ్ లో కేజీఎఫ్ రికార్డు
X
ఈ మధ్య కాలంలో వివిధ భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కన్నడ సినిమా ‘కేజీఎఫ్’. మామూలుగా దక్షిణాదిన కన్నడ సినిమాల్ని తక్కువగా చూస్తారు. వాళ్ల సినిమాలు ఒక మూసలో సాగుతుంటాయి. మన దగ్గర ఒకప్పుడు వచ్చిన రొటీన్ మాస్ మసాలా సినిమాల్నే వాళ్లు అనుసరిస్తుంటారు. అక్కడి సినిమాల బడ్జెట్లు.. హీరోల మార్కెట్లు కూడా తక్కువ. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ మార్పు వస్తోంది. అక్కడి స్టార్ హీరోలు కొత్తదనం కోసం ట్రై చేస్తున్నారు. కన్నడ సినిమాల బడ్జెట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ కోవలోనే యంగ్ హీరో యశ్ ప్రధాన పాత్రలో ‘కేజీఎఫ్’ అనే సినిమా తెరకెక్కింది.

దీని ట్రైలర్ తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లోనూ రిలీజై మంచి స్పందన రాబట్టుకుంది. ఈ సినిమాపై ఆయా భాషల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది. డిసెంబరు 21న రిలీజవుతున్న ఈ సినిమాకు వేరే భాషల్లో కూడా మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్ర యుఎస్ హక్కులు రూ.1.5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇది మన సినిమాలతో పోలిస్తే చిన్న ఫిగరే. కానీ కన్నడ సినిమాలకు మాత్రం చాలా పెద్ద మొత్తమే. యుఎస్ లో అత్యధిక రేటు దక్కించుకున్న కన్నడ సినిమా ‘కేజీఎఫ్’యేనట. ఈ చిత్రానికి అక్కడ పెద్ద ఎత్తున ప్రిమియర్లు కూడా వేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైనింగ్ మాఫియా చుట్టూ నడిచే కథతో తెరకెక్కింది. తెలుగులో అగ్ర నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం.