Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ మెహబూబాగా బాహుబలి ఐటెం...!

By:  Tupaki Desk   |   8 Feb 2022 7:30 AM GMT
కేజీఎఫ్‌ మెహబూబాగా బాహుబలి ఐటెం...!
X
యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ లో తమన్నా ఐటెం సాంగ్‌ ను మనం చూశాం. సినిమా భారీ విజయం సొంతం చేసుకుని పాన్‌ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లను దక్కించుకున్న నేపథ్యంలో కేజీఎఫ్ 2 ను అంతకు మించి అన్నట్లుగా తెరకెక్కించినట్లుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ 2 తో పోల్చితే కేజీఎఫ్‌ 1 కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ ప్రశాంత్ నీల్‌ చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న కేజీఎఫ్ కు సీక్వెల్‌ అంటే భారీతనం ఉండాలని ప్రశాంత్ నీల్ ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా లో షోలో సినిమా లోని మెహబూబా పాటను రీమేక్స్ చేసి ఐటెం సాంగ్‌ గా తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఫిబ్రవరి 14న కేజీఎఫ్ 2 నుండి ఆ ఐటెం సాంగ్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాటలో యశ్‌ కు జోడీగా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ స్టెప్పులు వేసింది అనే వార్తలు మొదటి నుండి వచ్చాయి. అన్నట్లుగానే బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నోరా ఫతేహి తో ఈ పాటను చేయించినట్లుగా తెలుస్తోంది. బాహుబలి సినిమా లో ఐటెం సాంగ్ చేయడం ద్వారా సౌత్‌ లో కూడా ఈఅమ్మడికి మంచి గుర్తింపు ఉంది. కనుక కేజీఎఫ్‌ 2 లో ఈమె ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేజీఎఫ్ 2 సినిమా లో హీరోయిన్ గా శ్రీనిధి నటించిన విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ లో కూడా శ్రీనిధి నే హీరోయిన్ గా నటించింది.

కేజీఎఫ్‌ 2 సినిమా ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. కనుక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. మెల్ల మెల్లగా ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమా ను ఇప్పటి నుండే మీడియా లో నిలిచేలా చేస్తారట. కేజీఎఫ్ 2 కి ఇప్పటికే విపరీతమైన బజ్ ఉంది. విడుదల సమయం కు ఆ క్రేజ్ ను మరింత ఎక్కువగా పెంచేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి మాత్రం వాయిదా వేసేది లేదు అన్నట్లుగా మేకర్స్ అదే తేదీకి ఫిక్స్ అయ్యి ఉన్నారు. కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల కాకుండానే ప్రభాస్ తో ప్రశాంత్‌ నీల్ సలార్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.