Begin typing your search above and press return to search.

KGF మేకర్స్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన అఖిల్

By:  Tupaki Desk   |   18 Jan 2023 6:30 AM GMT
KGF మేకర్స్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన అఖిల్
X
అక్కినేని అఖిల్ అదిరిపోయే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార లాంటి సూపర్ డూపర్ హిట్టు సినిమాలు తీసిన హోంబలే ఫిల్మ్స్ అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన కేజీఎఫ్ 1 & 2 సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన కాంతార సినిమాలను హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించింది. ఇప్పుడు అక్కినేని అఖిల్ తో హోంబలే ఫిల్మ్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అయినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. అఖిల్ మాస్ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోయారు. హోంబలే ఫిల్మ్స్ లాంటి ప్రముఖ సంస్థ ఇప్పుడు అఖిల్ తో సినిమా చేస్తుండటంతో పెద్ద హిట్టు కొట్టే కట్టే ఛాన్స్ ఉందని చాలా మంది భావిస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. అందులో కేజీఎఫ్ తో ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తోంది.అదే సలార్ సినిమా. ఇందులో డార్లింగ్ ప్రభాస్ హీరోగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అఖిల్ కూడా తన ప్రాణం పెట్టి ఈ సినిమాలో నటించినట్లుగా తెలుస్తోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఏజెంట్ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

2023 సమ్మర్ లో ఏజెంట్ సినిమా విడుదల అవుతుందని అంటున్నా డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ తో మాత్రం కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.