Begin typing your search above and press return to search.

'మహాసముద్రం' లో భయంకరంగా కనిపిస్తున్న 'కేజీఎఫ్' గరుడ..!

By:  Tupaki Desk   |   26 Jun 2021 5:30 AM GMT
మహాసముద్రం లో భయంకరంగా కనిపిస్తున్న కేజీఎఫ్ గరుడ..!
X
కన్నడ నటుడు రామచంద్ర రాజు 'కేజీఎఫ్' సినిమాలో ప్రతినాయకుడు 'గరుడ' పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఇతర భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న గరుడ రామ్.. ఇప్పుడు ''మహాసముద్రం'' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'ధనుంజయ్' అనే శక్తివంతమైన పాత్రను గరుడ రామ్ పోషిస్తున్నాడు. తాజాగా అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో 'కేజీఎఫ్ గరుడ' తరహాలోనే రామచంద్ర రాజు భయంకరంగా కనిపిస్తాడు.

దర్శకుడు అజయ్ భూపతి 'మహా సముద్రం' లో అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలతో అర్థం అవుతుంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన ‘గరుడ’ రామ్ ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. కన్నడ నటుడికి ఈ సినిమా తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చేలా అనిపిస్తోంది.

కాగా, యువ హీరో శర్వానంద్ - 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఫైనల్ షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు ఫీమేల్ లీడ్ రోల్స్‌ చేస్తున్నారు. జగపతి బాబు - రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న 'మహాసముద్రం' చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైన‌ర్‌ గా వ‌ర్క్ చేస్తున్నారు.