Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ ఫస్ట్‌ లవ్‌

By:  Tupaki Desk   |   18 Dec 2021 4:54 AM GMT
కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ ఫస్ట్‌ లవ్‌
X
పాన్ ఇండియా క్రేజ్ ఉన్న దర్శకులు కొద్ది మందే ఉన్నారు. వారిలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఒక్కడు. ఈయన కేజీఎఫ్‌ సినిమా తో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు కేజీఎఫ్‌ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్ తో చేస్తున్న సలార్ ను కూడా ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆ తర్వాత వరుసగా భారీ పాన్ ఇండియా సినిమా లను ప్రశాంత్ నీల్‌ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ప్రశాంత్ నీల్‌ కేజీఎఫ్ 2 కు రాబోతున్నాయనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ బాలీవుడ్‌ లో స్టార్‌ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకుని అక్కడి హీరోలకు కూడా మోస్ట్‌ వాంటెడ్‌ గా మారాడు. ఎంత ఫేమస్ అయినా కూడా మొదటి అవకాశం ఖచ్చితంగా స్పెషల్ అనడంలో సందేహం లేదు.

ఆఫర్ల కోసం చూస్తున్న సమయంలో మొదటి ఆఫర్ ఇచ్చిన వారిని ఎప్పుడు.. ఎవరు కూడా మర్చి పోకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తమ మొదటి సినిమా మూలాలను గుర్తు పెట్టుకున్నప్పుడే ఆ దర్శకుడు లేదా హీరో ఇతర టెక్నీషియన్ ను గొప్ప వాడిగా భావించాలి. ప్రశాంత్‌ నీల్‌ మొదటి సినిమా ఉగ్రమ్‌. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా కు ముందు ప్రశాంత్ నీల్ చాలా ప్రయత్నాలు చేశాడట. ఎంతో మంది హీరోలను సంప్రదించాడట.

కాని ఉగ్రమ్‌ సినిమా తో శ్రీ మురళి మాత్రమే ప్రశాంత్ నీల్‌ కు అవకాశం ఇచ్చాడు. కన్నడ యంగ్‌ స్టార్ అయిన శ్రీ మురళి చేసిన ఉగ్రమ్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కు కన్నడ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. కేజీఎఫ్‌ వంటి భారీ సినిమా అవకాశం రావడానికి కారనం సందేహం లేకుండా శ్రీ మురళి. అందుకే దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఇంకా కూడా హీరో శ్రీ మురళిని ఇష్టపడుతూనే ఉంటాడట.

తాజాగా శ్రీ మురళి పుట్టిన రోజున ఆయన చేసిన ట్వీట్‌ అందుకు నిదర్శణం. శ్రీమురళి పుట్టిన రోజు సందర్బంగా ప్రశాంత్‌ నీల్‌ ట్విట్టర్ లో నా ఫస్ట్‌ హీరో.. నా ఫస్ట్‌ లవ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ఏడాది మీకు మంచి విజయాలు దక్కాలని ఆశిస్తున్నాను అంటూ శ్రీ మురళి ట్వీట్‌ లో పేర్కొన్నాడు. మొదటి హీరో అవ్వడం వల్ల ఆయన పై చాలా ప్రేమ అభిమానం ప్రశాంత్ నీల్‌ కు ఉంది.

ఆ విషయాన్ని ఇలా షేర్‌ చేయడం జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ స్టార్‌ డైరెక్టర్‌. ఆయన గురించి ఎంతో మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన తన ఉగ్రమ్‌ హీరో శ్రీ మురళి గురించిన విషయాలను షేర్‌ చేస్తూ ఉన్నాడు అంటే ఇంకా ఆయనకు ఎంతటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రశాంత్‌ నీల్‌ సినిమాల విషయానికి వస్తే కేజీఎఫ్ 2 సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల కాబోతుంది. మరో వైపు ప్రభాస్ తో సలార్ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. రాధే శ్యామ్‌ విడుదల తర్వాత మళ్లీ సలార్ షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక కేజీఎఫ్‌ 2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కు మరిన్ని ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌ లతో సినిమాలు చేసేందుకు ఒప్పందాలు అయ్యాయి అనేది టాక్. అధికారికంగా మరింత క్లారిటీ రావాల్సి ఉంది.