Begin typing your search above and press return to search.

ఆ పాన్ ఇండియా మూవీ టీజర్ ఇప్పట్లో రాదంట!

By:  Tupaki Desk   |   18 April 2020 9:11 AM GMT
ఆ పాన్ ఇండియా మూవీ టీజర్ ఇప్పట్లో రాదంట!
X
కన్నడ స్టార్ హీరో యశ్ ఒక్కసారిగా కోలార్ గోల్డ్ ఫీల్డ్ సినిమాతో.. అదేనండి 'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ చాఫ్టర్1 మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి పెద్ద సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీలోనే 200కోట్ల పైచిలుకు వసూల్ చేసిన మొదటి సినిమాగా కేజీఎఫ్ రికార్డుల్లోకెక్కింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రానున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా వీరాభిమానులు హీరో యశ్ కేజీఎఫ్2 సినిమాకోసం.. యశ్ కేజీఎఫ్ కి డాన్ ఎలా అయ్యాడో చూడాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ లాక్‌ డౌన్ స‌మ‌యంలో రిలీజ్ అవుతుందని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం టీజ‌ర్ రిలీజ్ చేసే ప్ర‌ణాళిక‌లు ఏమి లేవ‌ని - సినిమా రిలీజ్‌ ముందే ట్రైలర్ లాంచ్ అవుతుందని నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టం చేశారు. చిత్రంలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌ గా క‌నిపించ‌నుండ‌గా - రావు ర‌మేష్‌ - రవీనాటండన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. సాయికొర్రపాటి తెలుగులో విడుదల చేయబోతున్నారు.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసిన కేజీఎఫ్ చిత్రం కన్నడతో పాటు - తెలుగు - హిందీ భాషల్లో అదిరిపోయే సక్సెస్‌ ను అందుకుని.. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా అన్నీ వర్గాలకు కనెక్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న లాక్‌ డౌన్ సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మోషన్ పోస్టర్ - రాంచరణ్ పాత్ర ఇంట్రడక్షన్ టీజర్ వీడియోలను రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే కేజీఎఫ్2 టీజర్ కూడా రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఇప్పట్లో ఈ సినిమా టీజర్ రాదని చిత్ర నిర్మాత తెలిపాడు. దీంతో కేజీఎఫ్ 2 టీజర్‌ పై ప్రేక్షకులు ఆశలు వదులుకున్నారు. చూడాలి మరి త్వరలో ఏదైనా తీపి కబురు అందిస్తారేమో..!