Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2.. ఆ విషయాన్ని ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేశారు

By:  Tupaki Desk   |   24 Feb 2022 6:00 AM IST
కేజీఎఫ్‌ 2.. ఆ విషయాన్ని ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేశారు
X
కన్నడ మూవీ కేజీఎఫ్‌ 2 కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దాని సీక్వెల్‌ పై గత మూడేళ్లుగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏప్రిల్‌ 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇటీవలే హీరో యశ్‌ డబ్బింగ్‌ కార్యక్రమాలు ముగించినట్లుగా ప్రకటించాడు. హీరోయిన్ మరియు ఇతర నటీ నటులు కూడా డబ్బింగ్ కార్యక్రమాలను ముగించుకున్నారు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఒక పాటను కేజీఎఫ్ 2 నుండి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ హంబుల్‌ ఫిల్మ్స్‌ వారు ఆసక్తికర ట్వీట్‌ చేయడం జరిగింది. సినిమా కోసం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులకు ప్రతిఫలం ఉండేలా సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమయంలో సదరు నిర్మాణ సంస్థ వారు ఒక పోల్‌ ను నిర్వహించారు. అభిమానుల నుండి అభిప్రాయంను కోరడం జరిగింది. కేజీఎఫ్‌ 2 నుండి పాటను కావాలనుకుంటున్నారా లేదంటే ట్రైలర్‌ ను ఆశిస్తున్నారా అంటూ ఆ పోల్‌ లో పేర్కొన్నారు.

72 శాతం మంది ట్రైలర్‌ కావాలంటూ ఓటింగ్‌ వేశారు. 15 శాతం మంది మాత్రం పాట లేదా ట్రైలర్ ఏదైనా పర్వాలేదు.. మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌ కావాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో వచ్చే నెల ఆరంభంలోనే ట్రైలర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

యశ్‌ హీరోగా శ్రీనిధి హీరోయిన్ గా రూపొందిన కేజీఎఫ్ 2 లో సంజయ్ దత్‌ మరియు ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో కేజీఎఫ్‌ ను మించి భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి చేరువ అయ్యేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

కన్నడం లో రూపొందిన ఈ సినిమా ను కేవలం సౌత్‌ భాషల్లోనే కాకుండా హిందీ లో కూడా విడుదల చేయబోతున్నారు. అక్కడ ఇక్కడ ప్రతి చోట కూడా భారీగా వసూళ్లను నమోదు చేయడం ఖాయం. యశ్‌ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌ గా నిలిచాడు. కేజీఎఫ్ పార్ట్‌ 2 తర్వాత ఆయన స్టార్‌ డమ్‌ మరింతగా పెరగడం ఖాయం. కేజీఎఫ్‌ 2 తర్వాత తెలుగు లో ప్రశాంత్‌ నీల్‌ మరింత బిజీగా మారుతాడని అంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ ను ప్రభాస్‌ తో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.