Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్ 2' బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోందట...!

By:  Tupaki Desk   |   15 May 2020 3:40 PM IST
కేజీఎఫ్ 2 బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోందట...!
X
ప్రపంచ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా 'కేజీఎఫ్‌'. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌' పాన్‌ ఇండియన్‌ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్‌’ నిలిచింది. సౌత్ ఇండియాలో 'బాహుబలి' తర్వాత హిందీలో సత్తా చాటిన సినిమాగా 'కేజీఎఫ్' నిలిచిపోయింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం స్వీకెల్‌ ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’ రానున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్‌ 2’ని హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ గా ఆవిష్కరిస్తున్నారని సమాచారం. దీంతో ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగి పోయాయి. ఇక ఇందులో నెగిటివ్ రోల్స్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో కూడా 'కేజీఎఫ్ 2' పై క్రేజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టే 'కేజీఎఫ్ 2' బిజినెస్ టాక్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయట.

కేవలం ఈ సినిమాకి సంబందించిన డిజిటల్ రైట్స్ కే ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వారు దాదాపు 55 కోట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది కాకుండా శాటిలైట్ మరియు థియేట్రికల్ బిజినెస్.. ఇవన్నీ ఇంకో 120 కోట్లు వరకు అవ్వచ్చు అనే టాక్ ఇండస్ట్రీ లో నడుస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగులో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేయబోతున్నారు. కాగా లాక్ డౌన్ వల్ల భారీ బడ్జెట్ సినిమాలకు బాగా దెబ్బ పడిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ప్రభావం వలన 'కేజీఎఫ్ 2' పెద్దగా నష్టపోలేదట. లాక్ డౌన్ లో కూడా 'కేజీఎఫ్ 2' కి పెద్దగా డామేజ్ జరగక పోవడానికి కారణం ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో నిర్మించడమే.

పాన్ ఇండియా మూవీస్ అని పాకులాడుతున్న మన వాళ్లు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి నష్టపోతున్నారు. ఇప్పటి నుండైనా 'కేజీఎఫ్ 2' ని ఉదాహరణగా తీసుకొని జాగ్రత్త పడితే లాభాలు వస్తాయని ట్రేడ్ నిపుణలు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాని అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా సందర్భంగా అక్టోబర్‌ 23న ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుమతిస్తే అనుకున్న సమయానికి థియేటర్లలో తీసుకొస్తామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.