Begin typing your search above and press return to search.

జులై 29న కేజీఎఫ్ 'బృటాలిటీ' లుక్ విడుదల!!

By:  Tupaki Desk   |   27 July 2020 12:15 PM IST
జులై 29న కేజీఎఫ్ బృటాలిటీ లుక్ విడుదల!!
X
ఇప్పటివరకు కన్నడ ఇండస్ట్రీలోనే 200కోట్ల పైచిలుకు వసూల్ చేసిన మొదటి సినిమాగా కేజీఎఫ్ రికార్డుల్లోకెక్కింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రానున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా వీరాభిమానులు హీరో యశ్ కేజీఎఫ్2 సినిమాకోసం.. యశ్ కేజీఎఫ్ డాన్ ఎలా అయ్యాడో చూడాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.

హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో రిలీజ్ అవుతుందని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం టీజ‌ర్ రిలీజ్ చేసే ప్ర‌ణాళిక‌లు ఏమి లేవ‌ని, సినిమా రిలీజ్‌ ముందే ట్రైలర్ లాంచ్ అవుతుందని నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టం చేశారు. అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. జులై 29న 10గంటలకు సంజయ్ దత్ అధీరా 'బృటాలిటీ' లుక్ విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేసాడు. ఈ వార్తతో కేజీఎఫ్ అభిమానులలో హుషారు మాములుగా లేదు.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసిన కేజీఎఫ్ చిత్రం కన్నడతో పాటు, తెలుగు, హిందీ భాషల్లో అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని.. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్నీ వర్గాలకు కనెక్ట్ అయింది. ఇది కూడా అలాగే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా మోషన్ పోస్టర్, రాంచరణ్ పాత్ర ఇంట్రడక్షన్ టీజర్ వీడియోలను రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే కేజీఎఫ్2 టీజర్ కూడా రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ ఆలోచనతోనే మొదటగా అధీరా బృటాలిటీ రిలీజ్ చేస్తున్నారేమో అని టాక్. ఇక చిత్రంలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా, రావు ర‌మేష్‌, రవీనాటండన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. సాయికొర్రపాటి తెలుగులో విడుదల చేయబోతున్నారు.