Begin typing your search above and press return to search.

షాక్‌: ఆరో రోజూ కెజిఎఫ్ దుమారం

By:  Tupaki Desk   |   27 Dec 2018 10:41 AM GMT
షాక్‌: ఆరో రోజూ కెజిఎఫ్ దుమారం
X
కంటెంట్ ఉన్న‌వాడే బాద్ షా. కంటెంట్ లేనివాడే జీరో అని నిరూపణ అయ్యింది! ఓవైపు బాక్సాఫీస్ రాక్ష‌సుడు లాంటి కింగ్ ఖాన్ కే ఎస‌రు పెట్టాడు కెజిఎఫ్ య‌శ్‌. డ్రైవ‌ర్ కొడుకేనా? అన‌డానికి లేదింక‌. సీన్ సితారైపోతోంది. ఉత్త‌రాదినా సౌత్ సినిమా డామినేష‌న్ కొన‌సాగుతోంది. బాహుబ‌లి త‌ర్వాత ఇది అనూహ్య ప‌రిణామం. బాహుబ‌లికి కొన‌సాగింపుగా ఒక అప్‌ కం స్టార్ న‌టించిన సినిమాకి, అస‌లు పేరూ ఊరూ తెలియ‌కుండానే బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు ఉత్త‌రాదిన‌. ఇది అనూహ్య ప‌రిణామం. దీనిని య‌శ్ సైతం జీర్ణించుకోలేక‌పోతున్నాడు.

కెజిఎఫ్ చిత్రం షారూక్ `జీరో`తో పోటీప‌డుతూ హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఇప్ప‌టికే 19కోట్లు వ‌సూలు చేసింది. అయితే తొలి రోజు కేవ‌లం 2.10 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసిన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో అంత‌కంత‌కు క‌లెక్ష‌న్లు పెంచుకుంటూ వ‌స్తోంది. మొద‌టి రోజుతో పోలిస్తే ఆరో రోజు, అది కూడా నాన్ హాలీడే రోజున రూ.2.90 కోట్లు వ‌సూలు చేసింది. వీకెండ్ త‌ర్వాత సోమ‌వారానికి ఫ‌లితం తేలిపోతున్న ఈ రోజుల్లో మౌత్ టాక్ తో గొప్ప విక్ట‌రీని సాధిస్తున్న సినిమాగా కెజిఎఫ్ పేరు మార్మోగిపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మాఫియా బ్యాక్ డ్రాప్ జ‌నాల‌కు పిచ్చిగా న‌చ్చేసిందని అర్థ‌మవుతోంది.

కెజిఎఫ్ హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి రోజు (శుక్ర‌) -2.10 కోట్లు, శ‌ని-3కోట్లు, ఆది-4.10 కోట్లు, సోమ‌-2.90 కోట్లు, మంగ‌ళ‌వారం- 4.35కోట్లు, బుధ‌-2.60కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. ఇప్ప‌టికి 19.05కోట్లు వ‌సూలు చేసింది. అంత‌కంత‌కు ఈ లెక్క‌లు మారుతున్నాయి. ఇక కెజిఎఫ్ లో య‌శ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కి ఉత్త‌రాదిన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు విజిల్స్ వేసి గోల చేయ‌డం పైనా య‌శ్ ఎంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతుండ‌డం టాలీవుడ్ మీడియా ముందు ఆ విష‌యాన్ని చెప్ప‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది.