Begin typing your search above and press return to search.

కేజీఎఫ్-2 టీజర్.. యశ్, ప్రశాంత్ నీల్ కు నోటీసులు!

By:  Tupaki Desk   |   14 Jan 2021 4:35 AM GMT
కేజీఎఫ్-2 టీజర్.. యశ్, ప్రశాంత్ నీల్ కు నోటీసులు!
X
జనవరి 8వ తేదీన రిలీజైన్ 'కేజీఎఫ్ చాప్టర్-2' సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించింది నెవ్వర్ బిఫోర్ రికార్డులను నెలకొల్పిందీ టీజర్. సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించింది.. ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ముహూర్తం పెట్టి టీజర్ రిలీజ్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. కానీ.. ఆలోపే టీజర్ లీక్ కావడంతో అనుకున్న సమయం కన్నా 12 గంటల ముందే టీజర్‌‌ను వదిలేశారు. అయితే.. ఇలా అనుకోకుండా వచ్చినా సరే.. కేజీఎఫ్-2 టీజర్.. సోషల్ మీడియాను షేక్ చేసేసింది. టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ మార్కును క్రాస్ చేయడం విశేషం. ఇక, ఈ టీజర్ లైక్స్ విషయంలో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సంపాదించిన తొలి టీజర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా కేజీఎఫ్-1. 2018లో విడుదలైన ఈ ఫస్ట్ పార్ట్ సంచలన విజయం నమోదు చేసింది. దీంతో.. సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆశించినట్టుగానే.. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన టీజర్ ను భారీగా వదిలారు మేకర్స్. అన్ని భాషల్లో కలిపి ఒకే టీజర్ ను వదలగా.. మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా.. ఈ టీజర్ కు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ నోటీసులు అందుకున్నారట! కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ ఈ నోటీసులు పంపించిందట. దర్శకుడు, హీరోతోపాటు నిర్మాత విజయ్ కు నోటీసులు పంపించారట అధికారులు. కారణం ఏమంటే.. రాకీ గన్ తో వాహనాలను షూట్ చేసి వచ్చి, ఆ వేడికి కణకణ మండుతున్న తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు కదా.. అక్కడే అభ్యంతరం తెలిపారు.

ఆ సీన్ దగ్గర "యాంటీ స్మోకింగ్ వార్నింగ్" ఎందుకు వేయలేదనేది వారి అభ్యంతరం. రూల్ ప్రకారం పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే వార్నింగ్ అక్కడ ఇవ్వాల్సి ఉంది. కానీ.. టీజర్లో వేయలేదు. దీంత.. ఎందుకు ఇవ్వలేదని నోటిస్ పంపారట. కాగా.. ఈ అంశాన్ని మేకర్స్ త్వరగానే సెట్ చేసుకుంటారని తెలుస్తోంది.