Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ 2 లుక్: సామ్రాజ్యాన్ని మ‌ళ్లీ నిర్మించే భాయ్

By:  Tupaki Desk   |   21 Dec 2019 6:35 PM IST
కేజీఎఫ్ 2 లుక్: సామ్రాజ్యాన్ని మ‌ళ్లీ నిర్మించే భాయ్
X
స‌లాం రాఖీ భాయ్ ..! అంటూ కేజీఎఫ్ స్టార్ య‌శ్ కి గ్రాండ్ వెల్ కం చెప్పారు ఫ్యాన్స్. కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియాని ఎదిరించే మొన‌గాడిగా అత‌డికి ఎంతో గౌర‌వం ద‌క్కింది. పాన్ ఇండియా కేట‌గిరీలో అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇచ్చారంటే భాయ్ పాత్ర‌లో అత‌డి న‌ట‌న నచ్చింద‌నే అర్థం. అటు హిందీ ప‌రిశ్ర‌మ స‌హా ఇటు ద‌క్షిణాదినా కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 విజ‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో ఈసారి చాప్ట‌ర్ 2 కోసం ఏడాది పొడ‌వునా య‌శ్- ప్ర‌శాంత్ నీల్- కిరంగ‌దుర్ బృందం ఎంతో శ్ర‌మిస్తోంది.

తాజాగా య‌శ్ ఫ‌స్ట్ లుక్ స్టిల్ రిలీజైంది. రీబిల్డింగ్ యాన్ ఎంపైర్! అనే క్యాప్ష‌న్ ని ఈ పోస్ట‌ర్ లో వేశారు. అంటే సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తున్నారా? మాఫియా సామ్రాజ్యంలో అడుగు పెట్టి అక్క‌డ అతీతుడు అయిన వాడినే లేపేసిన రాఖీ భాయ్ .. ఆ సామ్రాజ్యాన్ని త‌న హ‌స్త‌గ‌తం చేసుకున్నాడా? అయితే మ‌ళ్లీ కార్మికులకు అండ‌గా నిలుస్తున్నాడేమిటి?.. అంటే ఇంకా కార్మికుల త‌ర‌పున నిలిచి అంత‌కుమించిన విల‌న్ల‌తో ఫైట్ చేయాల్సి ఉంద‌నే దీన‌ర్థ‌మా? పైగా ఇందులో అధీరా అనే భీక‌రుడిని ఢీకొట్ట‌బోతున్నాడు రాఖీ భాయ్. అధీరా పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ ప్రవేశంతోనే మ‌రోసారి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి తెర తీశార‌ని అర్థ‌మ‌వుతోంది.

పాన్ ఇండియా లుక్ మ‌రింత‌గా పెంచే ఉద్ధేశ‌మే ఇద‌ని అర్థ‌మైంది. తాజా పోస్ట‌ర్ లో రాఖీ భాయ్ య‌శ్ ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. కేజీఎఫ్ గ‌నుల్లో కార్మికుడిగా చేరి అక్క‌డ ఒక సామ్రాజ్యాన్ని కూల‌దోసి ఇప్పుడిలా స్టైల్ గా ఫార్మ‌ల్ డ్రెస్ లో టక్కు టిక్కుతో క‌నిపించాడేమిటో! మాసీ గా సిగ‌రెట్ తాగుతూ .. రీ బిల్డింగ్ ప‌నిలో ఉన్నాడు మ‌రి. కార్మ‌కుల‌తో పాటు చెమ‌టోడుస్తూ గెలుపున‌కు సంకేతాన్ని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అస‌లు భాయ్ గుట్టేమిటో ప్ర‌శాంత్ నీల్ బృందం చెబుతుందేమో చూడాలి. 2020 స‌మ్మ‌ర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఏప్రిల్ లో రాఖీ భాయ్ ట్రీట్ ఉండ‌నుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.