Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2... హీరోయిన్‌ ముగించింది

By:  Tupaki Desk   |   4 Feb 2022 11:30 AM GMT
కేజీఎఫ్‌ 2... హీరోయిన్‌ ముగించింది
X
కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ 1 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఆ సినిమా కన్నడంలో మాత్రమే కాకుండా హిందీ.. తెలుగు ఇలా ప్రతి ఒక్క భాషలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్‌ సూపర్‌ హిట్‌ తో కేజీఎఫ్ 2 కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొదటి పార్ట్‌ కేవలం ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా పార్ట్‌ 2 అంటూ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు కేజీఎఫ్ 2 పై అంచనాలు అమాంతం పెంచాయి. ఆయన వ్యాఖ్యలు నిజమే అన్నట్లుగా పార్ట్ టీజర్‌ నిలిచింది. హీరో గన్‌ పేల్చి ఆ గన్ తో సిగరెట్‌ కాల్చడం నెవ్వర్‌ బిఫోర్‌ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ ప్రియులకు మాస్ ఆడియన్స్ కు ఖచ్చితంగా కేజీఎఫ్ 2 వింధు భోజనం అంటున్నారు.

కేజీఎఫ్ 2 సినిమా ఏడాది కాలంగా కరోనా వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఏప్రిల్‌ 14న విడుదల కాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. విడుదల ఆలస్యం అవుతూ ఉండటం వల్ల చిన్న చిన్న ప్యాచ్ వర్క్ రెగ్యులర్‌ గా చేస్తూనే ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా కేజీఎఫ్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన శ్రీనిధి శెట్టి సోషల్‌ మీడియా ద్వారా సినిమా గురించి చాలా రోజుల తర్వాత ఒక అప్‌డేట్‌ ను ఇచ్చింది. షూటింగ్‌ పూర్తి చేసిన తాను తాజాగా డబ్బింగ్‌ ను కూడా పూర్తి చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. డబ్బింగ్‌ స్టూడియోలో కేజీఎఫ్‌ కు డబ్బింగ్ చెప్పిన స్టిల్‌ ను కాస్త క్రియేటివిటీ జోడించి ఇన్ స్టా లో షేర్‌ చేసింది. కేజీఎఫ్ 2 గురించి ఏ చిన్న విషయం అయినా కూడా వైరల్‌ అవుతుంది. కనుక ఈ ఫొటో కూడా ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 వార్తల్లో నిలిచేలా చేసింది.

గత ఏడాదిలో హడావుడిగా విడుదల చేయాలని భావించిన మేకర్స్‌ ఆ తర్వాత పలు కారణాల వల్ల హడావుడి లేకుండా మెల్లగానే విడుదల చేద్దాం అంటూ కొన్ని నెలల క్రితమే ఏప్రిల్‌ 14 కు ఫిక్స్ చేశారు. కాని ఇప్పుడు ఆ తేదీన విడుదల అయ్యే నా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మూవీ ఒకటి అదే తేదీకి రాబోతుంది. అంతే కాకుండా రవితేజ హీరోగా నటించిన సినిమా కూడా ఆ తేదీకి రాబోతుంది.

కనుక కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల ఉంటుందా లేదా మళ్లీ వాయిదా పడుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కేజీఎఫ్‌ 2 కు డబ్బింగ్‌ పూర్తి చేశాను అంటూ శ్రీనిధి శెట్టి ప్రకటించడంతో పాటు ఏప్రిల్‌14 న కలుద్దాం అంటూ పేర్కొనడంతో సినిమా విడుదల ఖచ్చితంగా క్యాన్సిల్‌ అవ్వదని యశ్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.