Begin typing your search above and press return to search.

పీరియాడిక్ యాక్షన్ మూవీగా కేజీఎఫ్-2.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!

By:  Tupaki Desk   |   6 Jun 2021 4:30 AM GMT
పీరియాడిక్ యాక్షన్ మూవీగా కేజీఎఫ్-2.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
X
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా వైడ్ నేమ్ అండ్ ఫేమ్ పొందిన దర్శకులలో ఒకరు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. కేజీఎఫ్ అనే ఒక్క మాస్ యాక్షన్ సినిమాతోనే ఇండియన్ వైడ్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్. అటు కేజీఎఫ్ తో కన్నడ ఇండస్ట్రీ హద్దులను కూడా చెరిపేశాడు. కేజీఎఫ్ తోనే సంచలనంగా మారిన ప్రశాంత్.. ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ కేజీఎఫ్-2 పై భారీ అంచనాలు సెట్ చేసాడు. ఇప్పటికే టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. రోజురోజుకి ప్రేక్షకుల్లో కేజీఎఫ్ ఫీవర్ ఇంకా పెరుగుతుందనే చెప్పాలి. కేజీఎఫ్ సినిమాతో హీరో యష్ కూడా పాన్ ఇండియా స్టార్డం అందుకున్న విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. డార్లింగ్ ప్రభాస్ ను ఎన్నడూ చూడని మాస్ లుక్కులో చూపించనున్నాడు. సలార్ అనే టైటిల్ తోనే ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ తదుపరి సినిమాల లిస్ట్ చూసుకుంటే కొన్నేళ్లు కన్నడ వైపు దృష్టి పెట్టేలా లేడని టాక్. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఆ సినిమా తెరకెక్కనుంది.

అయితే ఇదివరకే కేజీఎఫ్ మూవీ రిలీజ్ డేట్ జులై 16గా ప్రకటించిన విషయం విదితమే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సినిమా రిలీజ్ కావడం లేదట. అలాగే ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈసారి సీక్వెల్లో బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టేందుకు ప్రశాంత్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అలాగే సినిమా రిలీజ్ ఆలస్యం అయినా పర్లేదని.. సినిమా పై నమ్మకంగా ఉన్నాడట. అయితే కేజీఎఫ్-2 మూవీ పీరియడిక్ యాక్షన్ మూవీ అని అంచనాలు పెంచేసాడు ప్రశాంత్. పీరియడిక్ యాక్షన్ అయినప్పటికీ యూనివర్సల్ కాన్సెప్ట్ తో వస్తుందని.. ప్రస్తుతానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రశాంత్ హైప్ డబుల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా జులై 16న రాకపోతే మాత్రం ఆర్ఆర్ఆర్ ప్లేస్ లో అక్టోబర్ 13న వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకం పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు.