Begin typing your search above and press return to search.

‘కేజీఎఫ్-2’ మరో సెన్సేషన్.. రికార్డు మైల్ స్టోన్!

By:  Tupaki Desk   |   15 Jan 2021 5:21 AM GMT
‘కేజీఎఫ్-2’ మరో సెన్సేషన్.. రికార్డు మైల్ స్టోన్!
X
ఇండియన్ మూవీ బాక్సాఫీస్ ను మరోసారి దున్నేసేందుకు సిద్ధమవుతోంది కేజీఎఫ్-2. టీజర్ తోనే తమ దండయాత్ర ఎలా ఉండబోతోందో చూపించారు ప్రశాంత్ నీల్, యశ్. జనవరి 8వ తేదీన రిలీజైన టీజర్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. విడుదలైన గంటల్లోనే కోట్లాది వ్యూస్ రాబట్టి చరిత్ర తిరగరాసింది.

యశ్ బర్త్ డే రోజైన జనవరి 8వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది యూనిట్. అయితే.. ఉదయం 10.18 నిమిషాలకు విడుదల కావాల్సిన టీజర్.. లీకేజీ ప్రాబ్లంతో అనుకున్న సమయం కన్నా.. 12 గంటల ముందే విడుదలైంది. అయితే.. ఇలా అనుకోకుండా టీజర్ వచ్చినా సరే.. అది సోషల్ మీడియాను షేక్ చేసేసింది. టీజర్ రిలీజైన కేవలం 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల (2.5 కోట్లు) మంది చూసేశారు. ఈ వ్యూయర్ షిప్ తో ప్రపంచ రికార్డు సృష్టించి విశ్లేషకులను సైతం విస్మయ పరిచింది.

ఇక లైక్స్ విషయంలోనూ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సంపాదించిన టీజర్‌గా వరల్డ్ రికార్డులు నెలకొల్పింది. ఇదంతా రిలీజైన తొలిరోజే నమోదైన సెన్సేషన్.

ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో కేజీఎఫ్ మరో మైల్ స్టోన్ క్రాస్ చేసింది. ఇండియన్ సినిమాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా పలు ఫాస్టెస్ట్ రికార్డులను నెలకొల్పింది ఈ టీజర్. తాజాగా 150 మిలియన్ వ్యూస్ మైల్ స్టోన్ ను అందుకుంది. అంతే కాకుండా 7.5 మిలియన్ లైక్స్ ను కూడా టచ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

కేజీఎఫ్-2 కోసం ప్రపంచం ఎంతలా ఎదురు చూస్తోందో.. ఈ లెక్కలే చెబుతున్నాయి. అయితే.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, త్వరలో రాబోయే ట్రైలర్ అంచనాలకు అందకుండా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.