Begin typing your search above and press return to search.

ఓటీటిలపై నేడు పార్లమెంటు లో కీలక నిర్ణయం.. ఉత్కంఠ

By:  Tupaki Desk   |   1 Dec 2021 12:12 PM IST
ఓటీటిలపై నేడు పార్లమెంటు లో కీలక నిర్ణయం.. ఉత్కంఠ
X
పార్లమెంట్ సమావేశాల్లో నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఓటీటీ విషయంలో మార్గదర్శకాలు, క్రిప్టో కరెన్సీ నిషేధంపై చర్చ జరగనున్నాయి. క్రిప్టో కరెన్సీని నిషేధించి దాని స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన బిల్లు సభల ముందుకు రానుంది. తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావించినా సాధ్యపడలేదు. అయితే దీనిని ఇవాళ సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనిని ఇందులో చాలా మంది ఇండియన్స్ పెట్టుబడులు పెట్టారు. అయితే దానికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదని ప్రచారం చేస్తోంది. దీంతో పార్లమెంట్ వేదికగా క్రిప్టో కరెన్సీపై కీలక ప్రకటన చేయనున్నారు.

ఇక ఓటీటీ ప్లాట్ ఫాం ను పర్యవేక్షించడానికి అనువైన మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా యాడ్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వర్టయిజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొన్ని మార్గదర్శకాలపై ప్రకటన చేయనున్నారు. అమెజాన్, నెట్ ప్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై టెలికాస్ట్ అవుతున్న అడ్వర్టయిజ్ మెంట్లను నియంత్రించడానికి ప్రత్యేకంగా ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని స్టాండర్డ్ కౌన్సిల్ ప్రతిపాదనలు చేసింది. దీనిపై ఉభయ సభల్లో చర్చించే అవకాశం ఉంది.

మరోవైపు దేశంలో బొగ్గు కొరత అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. బొగ్గు కొరత కారణంగా దేశంలోని థర్మల్ పవర్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిన విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్ లో బొగ్గు కొరత లేకుండా తీసుకునే చర్యలపై చర్చించనున్నారు. అయితే అధికారులు రూపొందించిన ప్రణాళికపై మంత్రిత్వ శాఖ ప్రసంగం చేసే అవకాశం ఉంది. గత కొంత కాలంగా బొగ్గు కొరత పై దేశంలో అనేక ఆందోళనలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా మీడియాలో నకిలీ వార్తలపై కూడా చర్యలు తీసుకునే విషయంలో చర్చలు జరననున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారు. న్యూస్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎలా కంట్రోల్ చేయాలన్న దానిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఫేక్ న్యూస్ వైరల్ కాకుండా నియంత్రించే విధానంపై చర్చిస్తారు.