Begin typing your search above and press return to search.

'రంగరంగ వైభవంగా' స్పెషాలిటీ అదే: 'రొమాంటిక్' భామ

By:  Tupaki Desk   |   30 Aug 2022 1:30 AM GMT
రంగరంగ వైభవంగా స్పెషాలిటీ అదే: రొమాంటిక్ భామ
X
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన భారీ అందాల భామలలో కేతిక శర్మ ఒకరు. 'రొమాంటిక్' సినిమాతో ఈ అమ్మాయి తెలుగు తెరపై అడుగుపెట్టింది. బంతి పువ్వులాంటి ఈ పిల్లను చూడగానే కుర్రాళ్లంతా హుషారెత్తిపోయారు.

ఇంతకాలం పాటు ఈ అమ్మాయి ఏమైపోయిందంటూ తెగ ఇదైపోయారు. అందగత్తెలకి అభిమానులుగా మారిపోయే విషయంలో ఆలస్యం చేస్తే పాపం తగులుతుందని భావించి, ఆ క్షణంలోనే తమ పేర్లను ఎంటర్ చేసుకున్నారు. అలా ఏర్పడిన క్రేజ్ కారణంగానే 'లక్ష్య' సినిమా ఫ్లాప్ అయినా, 'రంగ రంగ వైభవంగా' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

వైష్ణవ్ తేజ్ జోడీగా ఈ బ్యూటీ చేసిన ఈ సినిమా, వచ్చేనెల 2వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కేతిక సందడి చేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో కేతిక మాట్లాడుతూ .. 'రొమాంటిక్' సినిమా ఎంతవరకూ సక్సెస్ అయిందనే విషయాన్ని పక్కన పెడితే, ఆ సినిమా నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సెట్ లో ఎలా ఉండాలి? సీనియర్ ఆర్టిస్టులతో ఎలా నడచుకోవాలి? అనే విషయాలను నేర్చుకున్నాను. అందరూ ఒక కే కుటుంబంలా కలిసి పోవడం వలన, ఎలాంటి కొత్త లేకుండా నేను ఆ పాత్రను చాలా ఈజీగా చేయగలిగాను.

ఇక 'లక్ష్య' సినిమా విషయానికి వస్తే, ఆ సినిమా నుంచి నేను టెక్నికల్ విషయాలను తెలుసుకున్నాను. లైటింగును ఫేస్ చేసే విషయంతో పాటు అనేక అంశాలను గురించి తెలుసుకున్నాను. ఆ రెండు సినిమాలు కెరియర్ పరంగా నాకు చాలా ప్లస్ అయ్యాయనే అనుకుంటున్నాను.

ఇక 'రంగరంగ వైభవంగా' విషయానికి వస్తే ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమాలో నేను 'రాధ' పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర చాలా హానెస్టుగా .. బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. కథాపరంగా కెరియర్ ను .. ఫ్యామిలీని .. లవ్ ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. నేను ఇంతవరకూ చేసిన పాత్రల్లో నాకు నచ్చిన పాత్ర ఇది.

'రొమాంటిక్' విషయానికి వస్తే ఆ సినిమా యూత్ కి సంబంధించినది. యూత్ కి మాత్రమే అది కనెక్ట్ అయింది. అదే విధంగా 'లక్ష్య' విషయానికి వస్తే అది స్పోర్ట్స్ నేపథ్యంలో నడిచే కథ. ఆ తరహా కథలను ఇష్టపడేవారికి నేను ఆ సినిమా వలన తెలిశాను. 'రంగ రంగ వైభవంగా' విషయానికి వస్తే, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా వచ్చి ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అందువలన ఈ సినిమా నాకు తప్పకుండా పెద్ద హిట్ ను ఇస్తుందనే నమ్మకంఠీ ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది.