Begin typing your search above and press return to search.

నాగశౌర్య సరసన రొమాంటిక్ బ్యూటీ జతకట్టనుందా..?

By:  Tupaki Desk   |   7 Aug 2020 5:30 PM GMT
నాగశౌర్య సరసన రొమాంటిక్ బ్యూటీ జతకట్టనుందా..?
X
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఛలో సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా పడలేదు. ఛలో సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు విడుదలైనప్పటికీ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక చివరిగా తను స్వయంగా కథ అందించి నటించిన అశ్వద్ధామ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాను కూడా తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా కూడా నష్టపోయాడట. అశ్వద్ధామ సినిమా తర్వాత కొంచెం అలోచించి అడుగేస్తే బాగుంటుందని అనుకున్నాడేమో.. మంచి కథలను ఎంచుకొని నటిస్తూ పోతే అయిపోతుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఇక కొత్తగా సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఓ హిస్టారికల్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతుంది.

నాగశౌర్య మేకోవర్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ సిక్స్ ప్యాక్.. ఆ కండలు తిరిగిన దేహం చూసి షాక్ అవుతున్నారు. విలుకాడిగా కనిపిస్తాడేమో అని అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఏదో కొత్తదనం చూపిస్తాడని అర్ధమవుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఆ చర్చకు తెరదించుతూ.. పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీ హీరోయిన్ని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. అమ్మడి పేరు కేతిక శర్మ. నాగశౌర్య సరసన కేతికను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ వారు నారాయణదాసు నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ క్లోజ్ అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.