Begin typing your search above and press return to search.

లెమ‌న్ టీకి జాయిన్ అవుతారా?

By:  Tupaki Desk   |   12 April 2019 5:30 PM GMT
లెమ‌న్ టీకి జాయిన్ అవుతారా?
X
క‌ప్ కాఫీ తాగుదామా.. అంటూ `కాఫీ డే` ట్రీట్ కి అమ్మాయి పిలిస్తే జాయిన్ అవ్వ‌కుండా ఉంటారా? అలాంటిది ఇక్క‌డ బ్యూటిఫుల్ హీరోయిన్ కేతిక శ‌ర్మ‌ ఒక క‌ప్ లెమ‌న్ టీ తాగుదామా? అంటూ పిలుస్తుంటే వెళ్ల‌కుండా ఎలా ఉండ‌గ‌ల‌రు? అయితే త‌ను ఏ బీచ్ లో ఈ సెలబ్రేష‌న్ చేస్తోందో మాత్రం రివీల్ చేయ‌లేదు.

బ‌హుశా అక్క‌డ ఆకాశ్ పూరి - పూరి - ఛార్మి & టీమ్ ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఈ అమ్మ‌డు న‌టిస్తున్నది ఆకాశ్ పూరి `రొమాంటిక్` మూవీలో. ఛార్మి ద‌గ్గ‌రుండి ప్ర‌తిదీ జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు. ఆన్ లొకేష‌న్ నుంచి ఇటీవ‌లే ఛార్మి ర‌క‌ర‌కాల ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ట్వీట్ చేశారు. వాటికి అభిమానుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఇక‌పోతే రొమాంటిక్ సెట్స్ లో కేతిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ఇటీవ‌లే త‌న ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేసిన ఓ వీడియో రివీల్ చేసింది.

ఈ భామ ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ ఫోటోల్ని రివీల్ చేస్తోంది. ఆన్ లొకేష‌న్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ర‌క‌ర‌కాల ఫోటోల్ని రివీల్ చేస్తోంది. తాజాగా బికినీ బీచ్ లో ఓ కుర్చీ వేసుకుని కేతిక లోన్ లీగా లెమ‌న్ టీ తాగుతూ క‌నిపించింది. అంతేకాదు క‌ప్ లెమ‌న్ టీ క‌లిసి తాగుదామా? అంటూ కుర్ర‌కారును క‌వ్విస్తూ సామాజిక మాధ్య‌మాల్లో పిలుపునిచ్చింది. మోర్జిమ్ బీచ్ అంటూ ఓ విదేశీ బీచ్ లో కేతిక ఈ సెల‌బ్రేష‌న్ చేసుకుంద‌ని త‌ను ఇచ్చిన ఓ హింట్ రివీల్ చేస్తోంది.