Begin typing your search above and press return to search.

గుబులు రేపుతున్న పూరి డిస్క‌వ‌రీ

By:  Tupaki Desk   |   3 April 2019 9:10 AM GMT
గుబులు రేపుతున్న పూరి డిస్క‌వ‌రీ
X
ఆకాష్ పూరి స‌ర‌స‌న `రొమాంటిక్‌` అనే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది కేతిక శ‌ర్మ‌. ఈ నార్త్ గాళ్ ని ఏరి కోరి మ‌రీ ఎంచుకుంది పూరి- ఛార్మి బృందం. అయితే కేతిక‌లో అంతేం ఉంది? అని ప్ర‌శ్నించేవాళ్ల‌కు త‌న‌లోని వాడి వేడి ఎంతుందో ఇదిగో ఈ ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థ‌మ‌వుతుంది. క్రేజీగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న‌ కేతిక రెగ్యుల‌ర్ గా సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తోంది. వేడి వుంది.. ఒగ‌లు ఉంది.. హీటెక్కించే య‌వ్వారం ఉంది! అని తాజాగా రివీలైన ఫోటోలు, వీడియోలు చెబుతున్నాయి.

కేతిక లేటెస్ట్ గా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ ఫోటో అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. ఈ న్యూ లుక్ కిర్రాక్ అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రొమాంటిక్ అనే టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ అంద‌గ‌త్తెతో ఆకాష్ పూరి అదిరిపోయే రేంజులో రొమాన్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. పూరి నిర్ధేశ‌నంలో అత‌డి శిష్యుడు అనీల్ పాడూరి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నారు. ఇటీవ‌ల గోవాలో కీల‌క షెడ్యూల్ ని తెరెకెక్కించారు. అన్ని ప‌నులు పూర్తి చేసి ఈ స‌మ్మ‌ర్ లోనే రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

కేతిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ఇటీవ‌లే ఛార్మి స్వ‌యంగా త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో చెబుతోంది. ఇందులో ఆన్ లొకేష‌న్ కేతిక ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఈ బ్యూటీ రెగ్యుల‌ర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా జిమ్ముల్లో రెగ్యుల‌ర్ క‌స‌రత్తుల‌తోనూ వేడెక్కించేస్తోంది. ఆ వీడియోలు త‌న ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేసింది కేతిక‌. న్యూ దిల్లీకి చెందిన కేతిక ముంబై లో ర్యాంప్ వాక్ ల‌తో పాపుల‌రైంది. అటుపై డ‌బ్ స్మాష్ వీడియోల‌తో అంత‌ర్జాలంలో వేడెక్కించింది. ల‌క్కీగా పూరి క‌ళ్ల‌లో ప‌డిన ఈ బ్యూటీని సినిమా ఛాన్స్ వ‌రించింది. వెండితెర‌పై ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పెద్ద క‌ల‌లే కంటోంది. అయితే రొమాంటిక్ స‌క్సెస్ ని బ‌ట్టి త‌దుప‌రి కెరీర్ డిసైడ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు రామ్ హీరోగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాన్ని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో పూరి తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.