Begin typing your search above and press return to search.

పూరికి అచ్చొచ్చిన శ‌ర్మ గాళ్‌?

By:  Tupaki Desk   |   12 March 2019 1:30 AM GMT
పూరికి అచ్చొచ్చిన శ‌ర్మ గాళ్‌?
X
పూరి కాంపౌండ్ కి శ‌ర్మ గాళ్ అచ్చొస్తారా? చ‌రణ్ డెబ్యూ మూవీ `చిరుత‌`తో ముంబై గాళ్‌ నేహా శ‌ర్మ‌ను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేశాడు పూరి. ప్ర‌స్తుతం మ‌రోసారి శ‌ర్మ గాళ్ ని టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈసారి దిల్లీ నుంచి దిగుతోంది ఈ శ‌ర్మ గాళ్‌. అదీ.. కుమారుడు ఆకాష్ పూరి కోసం...

పూరి జ‌గ‌న్నాథ్ వార‌సుడు ఆకాష్ న‌టించిన తొలి సినిమా `మెహ‌బూబా` బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఎంతో జాగ్ర‌త్త‌గా రెండో సినిమాకి స్క్రిప్టును రెడీ చేశారు పూరి. రొమాంటిక్ అనే టైటిల్ ఎంపిక చేసుకున్నారు. అనీల్ పాడూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని పూరి జ‌గ‌న్నాథ్ - ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్లారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ప్ర‌స్తుతం గోవాలో తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రం లో ఆకాష్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఎవ‌రు? అన్న దానికి ఇంత‌కాలం స‌మాధానం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. దిల్లీకి చెందిన కేతిక శ‌ర్మ‌ను ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. కేతిక టాప్ మోడ‌ల్. ఇన్ స్టాగ్ర‌మ్ లో 10ల‌క్ష‌ల (ఒక మిలియ‌న్) అనుచ‌రులు ఉన్న సెన్సేష‌న‌ల్ గాళ్‌. డ‌బ్ స్మాష్ లతో పాపుల‌రైంది. తొలిసారి వెండితెర‌పై అదృష్టం ప‌రీక్షించుకోనుంది. ఆకాష్ తొలి సినిమా ఫెయిలైంది. ఆ సినిమాతో ప‌రిచ‌య‌మైన డెబ్యూ నాయిక ఏమైందో తెలీదు. క‌నీసం ఈ రెండో సినిమాకి శ‌ర్మ గాళ్ క‌లిసొస్తుందేమో చూడాలి.